Guitar Wiz: ఆపిల్ డిజైన్ అవార్డు గెలిచిన భారతీయ యాప్.. ప్రపంచాన్ని ఆకట్టుకున్న 'గిటార్ విజ్'
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ సాంకేతిక ప్రతిభ మరోసారి ప్రపంచ వేదికపై తన సత్తా చాటింది. భారతీయ డెవలపర్ బిజోయ్ తంగరాజ్ రూపొందించిన 'గిటార్ విజ్' (Guitar Wiz) యాప్‌కు 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక ఆపిల్ డిజైన్ అవార్డు లభించింది. విభిన్న సామర్థ్యాలు కలిగిన వినియోగదారులకు సంగీతాన్ని సులభంగా అందుబాటులోకి తీసుకురావడంలో చూపిన వినూత్నతకు గుర్తింపుగా 'ఇన్‌క్లూజివిటీ' విభాగంలో ఈ అవార్డును యాపిల్ ప్రకటించింది. గిటార్ నేర్చుకోవాలనుకునే ప్రారంభ స్థాయి విద్యార్థుల నుంచి అనుభవజ్ఞులైన సంగీతకారుల వరకు అందరికీ ఉపయోగపడేలా ఈ యాప్‌ను రూపొందించారు. స్వరాలు,కార్డ్స్,వేళ్ల స్థానాలు వంటి అంశాలపై వాయిస్ గైడెన్స్ అందించడం దీని ప్రధాన ప్రత్యేకత. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఇతరుల సహాయం లేకుండానే గిటార్ వాయించడం నేర్చుకునే అవకాశం పొందుతున్నారు.
వివరాలు
ప్రతి ఒక్కరికీ సంగీత విద్య అందుబాటులో ఉండాలనే లక్ష్యం
ప్రతి ఒక్కరికీ సంగీత విద్య అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ యాప్‌ను అభివృద్ధి చేసినట్లు ఆపిల్ ప్రశంసించింది. భిన్న భాషలు, నేపథ్యాలు, సామర్థ్యాలు కలిగిన వినియోగదారులు సైతం సులభంగా ఉపయోగించుకునేలా దీన్ని రూపొందించినట్లు పేర్కొంది. గిటార్ విజ్‌లో ఆపిల్‌కు చెందిన పలు యాక్సెసిబిలిటీ ఫీచర్లను సమర్థవంతంగా వినియోగించారు. డైనమిక్ టైప్,ఇంక్రీజ్డ్ కాంట్రాస్ట్,డిఫరెన్షియేట్ వితౌట్ కలర్ వంటి సదుపాయాల వల్ల ప్రత్యేక అవసరాలు ఉన్న వినియోగదారులు కూడా యాప్‌ను సౌకర్యవంతంగా ఉపయోగించగలుగుతున్నారు. ప్రతి ఏడాది యాపిల్ సంస్థ ఇన్నోవేషన్, సామాజిక ప్రభావం, డిజైన్, విజువల్ నాణ్యత వంటి పలు విభాగాల్లో అత్యుత్తమ యాప్‌లు, గేమ్‌లకు డిజైన్ అవార్డులను ప్రదానం చేస్తుంది.
వివరాలు
గతంలోనూ పలు భారతీయ యాప్‌లకు యాపిల్ అవార్డుల జాబితాలో చోటు
గతంలో లూమీ, డెనిమ్, ఎవాల్వ్, మెడిటేట్ వంటి భారతీయ యాప్‌లు కూడా ఈ గౌరవాన్ని అందుకున్నాయి. తాజాగా గిటార్ విజ్ సాధించిన ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా భారతీయ డెవలపర్ల ప్రతిభ, సృజనాత్మకతకు లభిస్తున్న గుర్తింపును మరోసారి చాటిచెప్పింది. ఇదే సమయంలో భారత మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్‌లలో కొత్త ఆరోగ్య సంబంధిత ఫీచర్లను ప్రవేశపెట్టడం కూడా విశేషంగా మారింది.