Page Loader
Nuclear Missile: నౌకాదళం నాల్గవ న్యూక్లియర్‌ పవర్డ్ బాలిస్టిక్‌ మిస్సైల్ జలాంతర్గామిని ఆవిష్కరించిన భారత్ 
నౌకాదళం నాల్గవ న్యూక్లియర్‌ పవర్డ్ బాలిస్టిక్‌ మిస్సైల్ జలాంతర్గామిని ఆవిష్కరించిన భారత్

Nuclear Missile: నౌకాదళం నాల్గవ న్యూక్లియర్‌ పవర్డ్ బాలిస్టిక్‌ మిస్సైల్ జలాంతర్గామిని ఆవిష్కరించిన భారత్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 22, 2024
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ అణు శక్తిని పెంచుకోవడానికి మరో అడుగు ముందుకు వేసింది. విశాఖ తీరంలో నౌకాదళం 4వ అణు సామర్థ్యంతో కూడిన దేశంలోనే తొలి బాలిస్టిక్‌ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి (ఎస్‌ఎస్‌బీఎన్‌)ని ఆవిష్కరించింది. ఈ కార్యక్రమం విశాఖపట్టణంలోని షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌లో జరగినట్లు సమాచారం. దామగుండంలో వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన మర్నాడే ఈ కార్యక్రమం జరిగిందని కథనాలు తెలిపాయి. ఈ ఏడాది ఆగస్టులో, ఎస్‌ఎస్‌బీఎన్‌ అరిఘాత్‌ను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ నౌకాదళానికి అందించారు. వచ్చే ఏడాదిలో, ఈ శ్రేణిలో నాలుగో సబ్‌మెరైన్‌ ఐఎన్‌ఎస్‌ అరిధమాన్‌ను సిద్ధం చేయనున్నట్లు నేవీ అధికారులు పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శత్రువులను ఎదుర్కొనడంలో జలాంతర్గాములకు మెరుగైన పాత్ర ఉంటుందని వారు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారత నౌకాదళం 4వ న్యూక్లియర్‌ పవర్డ్ బాలిస్టిక్‌ మిస్సైల్