Loading...
Anil Menon: విజయవంతంగా స్పేస్‌వాక్‌ చేసిన భారత సంతతి వ్యోమగామి అనిల్‌ మేనన్
విజయవంతంగా స్పేస్‌వాక్‌ చేసిన భారత సంతతి వ్యోమగామి అనిల్‌ మేనన్

Anil Menon: విజయవంతంగా స్పేస్‌వాక్‌ చేసిన భారత సంతతి వ్యోమగామి అనిల్‌ మేనన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 08, 2026
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి అనిల్‌ మేనన్‌ శుక్రవారం విజయవంతంగా స్పేస్‌వాక్‌ నిర్వహించారు. మరో వ్యోమగామి జెస్సికా మెయిర్‌తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో కీలకమైన పనిని పూర్తి చేశారు. ఐఎస్‌ఎస్‌లోని పవర్‌ ఛానల్‌కు అనిల్‌ మేనన్‌, జెస్సికా మెయిర్‌ కలిసి ఓ మోడిఫికేషన్‌ కిట్‌ను అమర్చారు. ఈ మార్పుతో భవిష్యత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మరిన్ని సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకునే అవకాశం కలుగుతుంది. దాదాపు ఆరున్నర గంటల పాటు ఈ స్పేస్‌వాక్‌ కొనసాగింది. ఈ సమయంలో ఇద్దరు వ్యోమగాముల మధ్య సరదా సంభాషణ కూడా చోటుచేసుకుంది.

వివరాలు

భావి చందమామ ఆవాసం కనిపిస్తోంది

స్పేస్‌వాక్‌ సందర్భంగా స్వల్ప విరామం సమయంలో జెస్సికా మెయిర్‌ అనిల్‌ మేనన్‌తో మాట్లాడుతూ.. అనిల్‌.. మీరు చందమామను చూడొచ్చని అన్నారు.

దానికి అనిల్‌ మేనన్‌ స్పందిస్తూ.. తన కుడివైపున చంద్రుడిని చూస్తున్నానని చెప్పారు. అక్కడ తనకు భావి చందమామ ఆవాసం కనిపిస్తోందని సరదాగా వ్యాఖ్యానించారు.

ఇక అనిల్‌ మేనన్‌, జెస్సికా మెయిర్‌ ఈ నెల 13న మరోసారి స్పేస్‌వాక్‌ నిర్వహించనున్నారు. రెండో స్పేస్‌వాక్‌లోనూ ఐఎస్‌ఎస్‌కు సంబంధించిన కీలక పనులను వారు చేపట్టనున్నారు.

ADVERTISEMENT