LOADING...
Iris: మనిషి జీవితంలో జరిగే ప్రతీ నిమిషాన్ని గుర్తుంచుకునే కొత్త పరికరం ఆవిష్కరణ 

Iris: మనిషి జీవితంలో జరిగే ప్రతీ నిమిషాన్ని గుర్తుంచుకునే కొత్త పరికరం ఆవిష్కరణ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2024
02:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత ఏడాది ఇదే రోజున మీరు ఏమి చేశారో గుర్తు లేకపోవచ్చు, కానీ ఇకపై ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. మనిషి జీవితంలోని ప్రతి నిమిషాన్ని గుర్తుంచుకునే కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు.. అద్వైత్‌ పాలీవాల్‌ అనే యువ ఇంజనీర్‌. ఈమేరకు ఓ వినూత్న గాడ్జెట్‌ను రూపొందించారు. 'ఐరిస్‌'అనే ఈ పరికరం చాలా ప్రత్యేకతలు కలిగి ఉందని అద్వైత్‌ తెలిపారు.ఈ పరికరం మనిషి జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనను ప్రతి నిమిషం ఫోటోల రూపంలో సేకరిస్తుంది. ఆ ఫోటోలు యూజర్‌ డివైజ్‌లో లేదా క్లౌడ్‌లో టైమ్‌లైన్‌ క్రమంలో స్టోర్ అవుతాయి. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో, గతంలో జరిగిన సంఘటనల గురించి కూడా వివరాలు అందిస్తుంది. 'ఐరిస్‌' పరికరం ధరించడానికి అనుకూలంగా రూపొందించబడింది.

వివరాలు 

ఆగ్మెంటేషన్ ల్యాబ్‌లో 'హ్యాకర్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్'లో పరికరం అభివృద్ధి 

ఈ పరికరం ఫోటోలు తీస్తున్న సమయంలో యూజర్‌ ఏదైనా విధంగా పరధ్యానం(Distraction)లో ఉంటే, తిరిగి ఫోకస్‌ చేయాలని సూచిస్తుంది. జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్న వారికి,ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని అద్వైత్‌ తెలిపారు. పరికరం రోగులు, వృద్ధుల సంరక్షణలో,పని ప్రదేశాల్లో భద్రతకు కూడా ఉపయోగపడుతుంది. గోప్యతకు సంబంధించిన ప్రశ్నలపై అద్వైత్‌ మాట్లాడుతూ.. ప్రతి ఆవిష్కరణకు మంచిచెడులు ఉంటాయని అన్నారు.ఈ పరికరం జ్ఞాపకశక్తి లేమితో బాధపడుతున్నవారికి చాలా మేలు చేస్తుందని చెప్పారు.అయితే ఫోటో రికార్డులను ఎలా వినియోగించాలన్నది వినియోగదారులపై ఆధారపడి ఉంటుందని..గోప్యతా,భద్రతా సమస్యలను కూడా వారు పరిగణించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ పరికరాన్ని ఆగ్మెంటేషన్ ల్యాబ్‌లో 'హ్యాకర్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్'లో అభివృద్ధి చేశారు.ఇది కేంబ్రిడ్జ్‌లో కొత్త ఆవిష్కరణల కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్‌లో భాగమని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పరికరం గురించి అద్వైత్‌ పాలీవాల్‌ చేసిన ట్వీట్