Loading...
Instagram-MUSE: ఇన్‌స్టాగ్రామ్ మ్యూజ్ ఆప్షన్.. మెటా తీసుకొచ్చిన పర్సనల్ ఏఐ ఏజెంట్.. ప్రత్యేకతలివే..
ప్రత్యేకతలివే..

Instagram-MUSE: ఇన్‌స్టాగ్రామ్ మ్యూజ్ ఆప్షన్.. మెటా తీసుకొచ్చిన పర్సనల్ ఏఐ ఏజెంట్.. ప్రత్యేకతలివే..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2026
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు యూజర్లకు షేర్ మెనూలో MUSE అనే కొత్త ఆప్షన్ కనిపిస్తోంది. తొలిసారి చూస్తే పోస్టులు, రీల్స్‌ను ఇతరులతో పంచుకునేందుకు ఉపయోగించే మరో ఫీచర్‌లా అనిపించొచ్చు. కానీ ఇది అలాంటిది కాదు. మెటా తీసుకొచ్చిన Muse AI ఏజెంట్ ఇది. సాధారణ చాట్‌బాట్‌లా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా.. రోజువారీ పనులను ప్లాన్ చేసుకోవడం, వాటిని నిర్వహించుకోవడంలో యూజర్లకు సహాయం చేయడం దీని ప్రధాన ఉద్దేశం.

వివరాలు 

MUSE అంటే ఏమిటి?

కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల షేర్ మెనూలో MUSE అనే కొత్త ఆప్షన్ కనిపిస్తోంది.

దానిపై ట్యాప్ చేస్తే "Muse from Meta" యాప్ లిస్టింగ్ ఓపెన్ అవుతుంది.

ఇందులో MUSEను "Your personal AI agent"గా పరిచయం చేశారు.

అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో లేదు. కొన్ని ప్రాంతాల్లో MUSE యాప్ లిస్టింగ్ కనిపిస్తుండగా.. మరికొన్ని దేశాల్లో ఇది ఇంకా అందుబాటులో లేదనే సమాచారం కనిపిస్తోంది.

అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టాగ్రామ్ యూజర్లందరికీ ఒకేసారి ఈ ఫీచర్ యాక్సెస్ ఇవ్వలేదు. భారత్‌లోనూ MUSE యాక్సెస్ ప్రస్తుతం అందుబాటులో లేదు.

వివరాలు 

పనులను దశలవారీగా ప్లాన్ చేసే AI

MUSEను కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే AIగా కాకుండా.. ఒక పని పూర్తయ్యే వరకు అవసరమైన వివిధ దశలను అర్థం చేసుకుని వాటిని ప్లాన్ చేసేలా రూపొందించారు.

ఉదాహరణకు టికెట్ల ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. సరైన సమయంలో రిజర్వేషన్ చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.

అలాగే ఈమెయిల్‌లో ఏదైనా ఫారం వస్తే దాన్ని పూర్తి చేయడంలో, ఆ తర్వాత చేపట్టాల్సిన ప్రక్రియ ఏమిటో అర్థం చేసుకోవడంలోనూ సహాయం చేయగలదు.

అవసరమైన పనులకు రిమైండర్లను ఏర్పాటు చేసుకునే సదుపాయం కూడా ఇందులో ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

ఖర్చులు, సేవింగ్స్‌పైనా సూచనలు

రోజువారీ పనులతో పాటు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కొన్ని పనుల్లోనూ MUSEను ఉపయోగించుకోవచ్చు.

యూజర్ ఖర్చులను పరిశీలించి.. ఎక్కడ డబ్బు ఆదా చేసే అవకాశం ఉందో గుర్తించడంలో ఇది సహాయం చేస్తుంది.

ఉదాహరణకు ఒకేసారి చాలా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్లు కొనసాగుతున్నట్లయితే.. వాటిలో అవసరం లేనివి ఏమైనా ఉన్నాయా అనేది గుర్తించడంలో MUSE ఉపయోగపడుతుంది.

అయితే సబ్‌స్క్రిప్షన్ రద్దు చేయడం, ఏదైనా చెల్లింపు చేయడం వంటి తుది నిర్ణయాలు మాత్రం యూజర్‌దే.

అంటే AI సూచనలు ఇవ్వగలిగినా.. ఖర్చుకు సంబంధించిన చివరి అనుమతి యూజర్ చేతిలోనే ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

పెద్ద లక్ష్యాలకూ ప్లానింగ్

MUSEను కేవలం చిన్న చిన్న రోజువారీ పనులకే పరిమితం చేయలేదు.

యూజర్లు తమ పెద్ద లక్ష్యాలను కూడా దీని సహాయంతో ప్లాన్ చేసుకోవచ్చు.

ఉదాహరణకు డిన్నర్ రిజర్వేషన్, మారథాన్‌కు సిద్ధం కావడం, కొత్త కారు కొనుగోలు కోసం డబ్బు దాచుకోవడం వంటి లక్ష్యాలను ఇందులో ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది.

యూజర్ తన లక్ష్యాన్ని తెలియజేస్తే.. దాన్ని సాధించేందుకు అవసరమైన పనులను దశలవారీగా విభజించి ప్లాన్ చేసుకోవడంలో AI సహాయం చేస్తుంది.

వివరాలు 

పలు యాప్స్‌తో కనెక్ట్ చేసుకునే అవకాశం

MUSE ప్రత్యేకతల్లో మరోటి ఇతర యాప్స్, సర్వీసులతో కనెక్ట్ చేసుకునే అవకాశం. ఇందులో Gmail, Google Calendar, Health, Facebook, Instagram, Peloton, Finance వంటి కనెక్షన్లు ఉన్నాయి.

ఈ సర్వీసులను కనెక్ట్ చేసిన తర్వాత.. వాటిలోని యూజర్‌కు సంబంధించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని వివిధ పనుల్లో MUSE సహాయం చేయగలదు.

అయితే అన్ని కనెక్షన్లు, ఫీచర్లు ప్రతి యూజర్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు.

యూజర్ ఉన్న ప్రాంతం, సంబంధిత సేవల లభ్యతను బట్టి MUSEలో అందుబాటులో ఉండే ఆప్షన్లు మారవచ్చు.

ADVERTISEMENT