Loading...
Instagram: 'ఇన్‌స్టాగ్రామ్'.. లేక 'ఇన్‌స్టాగ్‌జామ్‌'? కొత్త లోగోపై నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
'ఇన్‌స్టాగ్రామ్'.. లేక 'ఇన్‌స్టాగ్‌జామ్‌'? కొత్త లోగోపై నెటిజన్ల ఫన్నీ కామెంట్స్

Instagram: 'ఇన్‌స్టాగ్రామ్'.. లేక 'ఇన్‌స్టాగ్‌జామ్‌'? కొత్త లోగోపై నెటిజన్ల ఫన్నీ కామెంట్స్

వ్రాసిన వారు Moogati Shabari
Aug 14, 2026
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇన్‌స్టాగ్రామ్‌ తన వర్డ్‌మార్క్‌ లోగోను కొత్తగా మార్చింది. పదేళ్ల తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ చేసిన తొలి ప్రధాన మార్పు ఇదే. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ అధిపతి ఆడమ్‌ మొస్సేరి వెల్లడించారు. కొత్త డిజైన్‌ మరింత షార్ప్‌గా, ఆధునికంగా కనిపించేలా రూపొందించామని మొస్సేరి తెలిపారు. అదే సమయంలో పాత లోగోకు ఉన్న ప్రత్యేకతను గుర్తు చేసేలా, సరళతను కొనసాగించేలా కొత్త డిజైన్‌ను రూపొందించినట్లు చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌ చివరిసారిగా 2016లో పెద్ద మార్పు చేసింది. అప్పటివరకు ఉన్న రెయిన్‌బో స్ట్రైప్‌తో కూడిన క్లాసిక్‌ బ్రౌన్‌ కెమెరా లోగో స్థానంలో రంగురంగుల పింక్‌ గ్రేడియంట్‌ ఐకాన్‌ను తీసుకొచ్చింది. అదే లోగోను ప్రస్తుతం కూడా ఉపయోగిస్తున్నారు.

వివరాలు

లోగోను ఎందుకు మార్చారంటే..

యాప్‌లో పైన కనిపించే వర్డ్‌మార్క్‌లో పదేళ్లుగా ఎలాంటి మార్పు చేయలేదని మొస్సేరి తెలిపారు.

అందుకే ఇప్పుడు దానికి కొత్త రూపు ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.

కొత్త డిజైన్‌ మరింత క్లీన్‌గా, ఆధునికంగా ఉండటంతో పాటు.. ఇన్‌స్టాగ్రామ్‌ ఒరిజినల్‌ లోగోలోని అంశాలను కూడా గుర్తు చేసేలా రూపొందించినట్లు ఆయన వివరించారు.

సరళత, డిజైన్‌లోని నైపుణ్యం వంటి ఇన్‌స్టాగ్రామ్‌ ప్రత్యేకతలను కొనసాగించినట్లు చెప్పారు.

కొత్త వర్డ్‌మార్క్‌లో ఇన్‌స్టాగ్రామ్‌కు ప్రత్యేకమైన స్క్రిప్ట్‌ స్టైల్‌ అలాగే ఉంది. అయితే అక్షరాల ఆకృతులను మాత్రం కొత్తగా రీడిజైన్‌ చేశారు.

వివరాలు

'ఇన్‌స్టాగ్‌జామ్‌' అంటూ నెటిజన్ల కామెంట్స్

కొత్త వర్డ్‌మార్క్‌పై యూజర్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

కొందరు కొత్త డిజైన్‌ను ప్రశంసిస్తుండగా.. మరికొందరు మాత్రం ఈ మార్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇక కొంతమంది నెటిజన్లు కొత్త ఫాంట్‌ను చూసి సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

కొత్త లోగోలోని 'r' అక్షరం ఆకారం కారణంగా 'Instagram' అనే పదం 'Instagzam'గా కనిపిస్తోందంటూ జోకులు చేస్తున్నారు.

అయితే ఈ స్పందనల మధ్య కూడా కొత్త డిజైన్‌ పాత లోగోకు నివాళిగా ఉంటూనే.. మరింత ఆధునికంగా, క్లీన్‌గా ఉండేలా రూపొందించామని మొస్సేరి స్పష్టం చేశారు.

ADVERTISEMENT