Loading...
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో త్వరలో 'రిడ్-ఓన్లీ మోడ్'.. పెయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్?
ఇన్‌స్టాగ్రామ్‌లో త్వరలో 'రిడ్-ఓన్లీ మోడ్'.. పెయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్?

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో త్వరలో 'రిడ్-ఓన్లీ మోడ్'.. పెయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2026
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ల కోసం ఓ కొత్త ఫీచర్‌పై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 'రీడ్-ఓన్లీ మోడ్' (Read-only Mode) పేరుతో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. లీకర్, రివర్స్ ఇంజినీర్ అలెస్సాండ్రో పలుజ్జీ ఈ ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లను 'ఎక్స్‌'లో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మోడ్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ను బ్రౌజ్ చేయవచ్చు కానీ పోస్టులకు లైక్, కామెంట్ చేయడం, మెసేజ్‌లు పంపడం, ఇతరులను ఫాలో అవడం, స్టోరీలను చూడటం వంటి అవకాశాలు ఉండవని తెలుస్తోంది. ఇది ఇన్‌స్టాగ్రామ్‌ ప్లస్‌ వంటి పెయిడ్‌ అకౌంట్ల కోసం ఉద్దేశించిన ఫీచర్‌ కావచ్చని అంచనా.

వివరాలు 

బాహ్య పరీక్షలు కాదు.. అంతర్గతంగా మాత్రమే పరిశీలన

ఈ ఫీచర్‌పై వస్తున్న వార్తలపై ఇన్‌స్టాగ్రామ్‌ స్పందించింది. 'రీడ్-ఓన్లీ మోడ్‌' ప్రస్తుతం సంస్థ అంతర్గతంగా పరిశీలిస్తున్న ఫీచర్‌ మాత్రమేనని, బయటి యూజర్లపై ఎలాంటి పరీక్షలు నిర్వహించడం లేదని ఇన్‌స్టాగ్రామ్‌ ప్రతినిధి 'ఎంగాడ్జెట్‌'కు తెలిపారు.

అంటే ఈ ఫీచర్‌ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, సాధారణ యూజర్లకు అందుబాటులోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

వివరాలు 

దుర్వినియోగం జరిగే అవకాశం.. భద్రతపై ఆందోళనలు

రీడ్-ఓన్లీ మోడ్‌ అందుబాటులోకి వస్తే యూజర్లకు కొంత అదనపు గోప్యత లభించే అవకాశం ఉన్నప్పటికీ, దీనివల్ల కొన్ని భద్రతా సమస్యలు కూడా తలెత్తవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా ఈ ఫీచర్‌ను కొందరు ఇతరులను వేధించడం, వారి కార్యకలాపాలను గమనించడం వంటి దుర్వినియోగాలకు ఉపయోగించే అవకాశం ఉందని ఆందోళనలు ఉన్నాయి.

అయితే ఈ అంశాలపై ఇన్‌స్టాగ్రామ్‌ అంతర్గతంగా ఏమైనా చర్యలు తీసుకుందా అనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు.

భవిష్యత్తులో ఈ ఫీచర్‌ను బాహ్యంగా పరీక్షించే ముందు లేదా అధికారికంగా విడుదల చేసే ముందు ఇలాంటి భద్రతా సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది.

ADVERTISEMENT