Internet Explorerకు ఇక సెలవు పూర్తిగా డిసేబుల్ చేసిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా Windows 10లో Internet Explorerను డిసేబుల్ చేసింది. ఇది ఫిబ్రవరి 14 నుండి అమలు అవుతుంది. గత సంవత్సరం యాప్‌కు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ను కంపెనీ నిలిపివేసినప్పటికీ, బ్రౌజర్ ఇప్పటికీ ఆపరేటింగ్ సిస్టమ్ ముందు వెర్షన్‌లో నడుస్తుంది. ఇప్పుడు Windows 10 PCలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ చిహ్నంపై క్లిక్ చేస్తే మైక్రోసాఫ్ట్ Edge తెరుచుకుంటుంది. మైక్రోసాఫ్ట్ జూన్ 15, 2022న Internet Explorerకి సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ను అందించడం ఆపేసింది. డిసెంబర్‌లో, ఫిబ్రవరి 14, 2023న వెబ్ బ్రౌజర్‌ను డిసేబుల్ చేస్తామని కంపెనీ ప్రకటించింది. బ్రౌజింగ్ యాప్ డియాక్టివేట్ అయినా ఇంకా కొన్ని కనిపిస్తాయి, నెలవారీ సెక్యూరిటీ అప్‌డేట్ ద్వారా జూన్ 2023లో వాటిని పూర్తిగా తీసేస్తారు
2021 చివరిలో విడుదలైన Windows 11లో Internet Explorer లేదు
2021 చివరిలో విడుదలైన Windows 11లో Internet Explorer లేదు. కంపెనీ ప్రకటన ప్రకారం, బ్రౌజర్ విండోస్ అప్‌డేట్ తో కాదు మైక్రోసాఫ్ట్ Edge అప్‌డేట్ ద్వారా డిసేబుల్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ Edgeలో IE మోడ్‌ను ఇంటిగ్రేట్ చేసింది. మైక్రోసాఫ్ట్ IE మోడ్‌తో మైక్రోసాఫ్ట్ Edgeకి మారడానికి వినియోగదారులను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ఎడ్జ్ బ్రౌజర్‌ని ఉపయోగిస్తుంటే IE మోడ్‌కి మారాలనుకుంటే (edge://settings/defaultbrowser)కి వెళ్లి, 'IE మోడ్'ని గుర్తించడానికి సెర్చ్ ను ఉపయోగించి, Internet Explorer మోడ్‌లో సైట్‌లను రీలోడ్ చేయడానికి అనుమతించడానికి టోగుల్‌ను ప్రారంభించి బ్రౌజర్‌ను పునఃప్రారంభించండి.