LOADING...
iPhone users: ఐఫోన్‌ యూజర్ల కోసం గూగుల్ కీలక ప్రకటన.. యూట్యూబ్‌ వాడే వారికి అప్‌డేట్‌
ఐఫోన్‌ యూజర్ల కోసం గూగుల్ కీలక ప్రకటన.. యూట్యూబ్‌ వాడే వారికి అప్‌డేట్‌

iPhone users: ఐఫోన్‌ యూజర్ల కోసం గూగుల్ కీలక ప్రకటన.. యూట్యూబ్‌ వాడే వారికి అప్‌డేట్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2025
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐఫోన్‌ వాడుతున్న యూజర్లకు గూగుల్‌ కీలక హెచ్చరిక జారీ చేసింది. తమ ఐఫోన్‌లలో యూట్యూబ్‌ యాప్‌ను వాడుతున్నవారు వెంటనే దానిని రీ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని స్పష్టంగా సూచించింది. ఇటీవల యాప్‌ పనితీరులో ఏర్పడిన సమస్యలపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో,గూగుల్‌ స్పందించి ఈ అప్డేట్‌ను ఇచ్చింది. తాము సమస్యను పరిష్కరించామని కూడా ఒక అధికార ప్రకటన ద్వారా వెల్లడించింది. గత కొన్ని రోజులుగా ఐఫోన్‌ యూజర్లు యూట్యూబ్‌ యాప్‌ను ఓపెన్‌ చేసిన వెంటనే అది క్రాష్‌ అవుతుండటం, ఫ్రీజ్‌ అవుతుండటం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఓఎస్‌ (iOS) యూజర్లకు తలెత్తింది. అంతేకాదు, కొంతమంది ఆండ్రాయిడ్‌ యూజర్లు కూడా ఇదే తరహా సమస్యలను అనుభవిస్తున్నట్లు గూగుల్‌కు ఫిర్యాదులు వచ్చాయి.

వివరాలు 

యాడ్‌బ్లాకర్‌లు లేదా థర్డ్‌ పార్టీ యాప్‌లను ఉపయోగిస్తున్న యూజర్స్ 

వాటన్నింటినీ పరిశీలించిన గూగుల్‌ తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంది. గూగుల్‌ ముఖ్యంగా ఐఫోన్‌ వినియోగదారులకు ఒక కీలకసూచన చేసింది. ప్రస్తుతం ఉన్నయూట్యూబ్‌ యాప్‌ను ముందుగా డిలీట్‌ చేసి,ఆతర్వాత ఫోన్‌ను ఒకసారి రీస్టార్ట్‌ చేయాలని తెలిపింది. అనంతరం యాప్‌స్టోర్‌ ద్వారా యూట్యూబ్‌ తాజా వెర్షన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. ఇలాచేయడం వల్ల యాప్‌ ఇకపై క్రాష్‌ అవ్వడం లేదా స్టక్‌ అవ్వడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయని పేర్కొంది. ఇకపోతే యాడ్‌బ్లాకర్‌లు లేదా థర్డ్‌ పార్టీ యాప్‌లను ఉపయోగిస్తున్న కొంతమందియూజర్లకు కూడా యూట్యూబ్‌ యాప్‌ క్రాష్‌ అవుతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. అయితే గూగుల్‌ ఎప్పటి నుంచో యాడ్‌ బ్లాకర్లను అడ్డుకుంటున్న నేపథ్యంలో,అలాంటి యూజర్లకు ఈరకమైన సమస్యలు తలెత్తుతున్నాయని టెక్నాలజీ వర్గాలు చెబుతున్నాయి.