LOADING...
Mobile Fast Charging: ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఫోన్‌ బ్యాటరీకి ప్రమాదమా..? ఈ విషయాలు తెలుసుకోండి!
ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఫోన్‌ బ్యాటరీకి ప్రమాదమా..? ఈ విషయాలు తెలుసుకోండి!

Mobile Fast Charging: ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఫోన్‌ బ్యాటరీకి ప్రమాదమా..? ఈ విషయాలు తెలుసుకోండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 29, 2025
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ రోజుల్లో స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది. ఫోన్‌ కొనుగోలు చేసే ముందు అది ఎంత వేగంగా ఛార్జ్ అవుతుందో, ఎంతసేపు పట్టుతోందో తప్పకుండా చూసుకుంటారు. గంటల తరబడి ఫోన్‌ను ప్లగ్‌లో పెట్టే రోజులు పోయాయి. కొన్ని నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుండటం అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సౌకర్యం వెనుక ఉన్న సమస్యలు గుర్తించారా? ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మొదట లాభం అయినా దీర్ఘకాలంలో నష్టాలు కలిగించవచ్చు. టెక్ నిపుణుల ప్రకారం సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ మొదట్లో ఉపయోగకరంగా అనిపించినా, కాలక్రమంలో ఫోన్‌కి, ముఖ్యంగా బ్యాటరీకి నష్టాన్ని కలిగించవచ్చు.

Details

ఏమి జరుగుతోంది ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల?

ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల బ్యాటరీ వేగంగా ఛార్జ్ అవుతుంది. కానీ అదే వేగంతో బ్యాటరీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఫోన్ ఓవర్‌హీట్ కావడానికి దారితీస్తుంది. ఓవర్ హీట్ అయిన ఫోన్ పేలే ప్రమాదం కూడా ఉంటుంది. ఫోన్ పూర్తిగా కొత్తగా ఉన్నప్పుడే మాత్రమే వేగంగా ఛార్జ్ అవుతుంది. కొన్ని నెలల తర్వాత మాత్రం ఛార్జింగ్ స్పీడ్ తగ్గడం మీరు గమనించవచ్చు. ఉదాహరణకు కొత్త ఫోన్‌ను 40 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయగలిగే ఛార్జర్, ఆరు నెలల తర్వాత అదే ఫోన్‌ను ఛార్జ్ చేయడానికే ఎక్కువ సమయం పడుతుంది.

Details

దీనికి కారణం?

దీన్ని గమనించని వారు చాలామంది ఉన్నా, దీని వెనక అసలు కారణం బ్యాటరీ మీద పడిన ఒత్తిడి. వేగంగా ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది. ఫలితంగా ఛార్జింగ్ సమయం పెరిగిపోతుంది. అదే సమయంలో వేడెక్కడం కూడా ఎక్కువవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌ ప్రయోజనాలు 1. సమయాన్ని ఆదా చేయడం గంటల తరబడి ఫోన్‌ను ప్లగ్‌లో పెట్టాల్సిన పని లేకుండా కొన్ని నిమిషాల్లోనే ఛార్జ్ అయిపోతుంది. 2. అత్యవసర పరిస్థితుల్లో లాభం ఫోన్ పూర్తిగా డిశ్చార్జ్ అయి ఉన్నా, తక్షణమే ఛార్జ్ చేయాల్సిన అవసరమున్నప్పుడు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

Details

ఈ పొరపాటు చేయకండి

ఒరిజినల్ ఛార్జర్ లేదా కేబుల్ దెబ్బతిన్నప్పుడు, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న చౌక ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ లేదా కేబుల్‌ వాడటం ప్రమాదకరం. ఇది ఫోన్ పేలుడుకు దారితీసే అవకాశం ఉంది. ఫోన్‌కు తగినట్టే ఒరిజినల్ ఛార్జింగ్ యాక్సెసరీస్ వాడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఉన్నా, దీన్ని సమంజసంగా ఉపయోగించాలి. అవసరమైతేనే ఫాస్ట్ ఛార్జింగ్ ఆన్ చేయడం, వాస్తవికమైన ఛార్జింగ్ అవసరాలకు మాత్రమే వినియోగించడం మంచిది. వేగం మంచిదే కానీ.. కంట్రోల్‌లో ఉండాలి!