మరోసారి కక్ష్యను తగ్గించిన ఇస్రో: చంద్రుడికి మరింత దగ్గరలో చంద్రయాన్-3
ఈ వార్తాకథనం ఏంటి
చంద్రుడి పైకి చంద్రయాన్-3 ప్రయాణం కొనసాగుతూనే ఉంది. భూ కక్ష్య నుండి వేరుపడిన చంద్రయాన్-3, చంద్రుడి కక్ష్యలోకి శనివారం చేరుకుంది.
తాజాగా చంద్రుడి కక్ష్యలో కుదింపు జరిగింది. దీంతో చంద్రుడికి మరింత దగ్గరకు చంద్రయాన్-3 చేరుకుంది. జాబిల్లిని తాకడానికి మరికొంత సమయాన్ని తగ్గించుకుంది.
ఆదివారం రాత్రి అంతరిక్ష నౌక ఇంజన్ మండించి కక్ష్యను కుదించడంతో జాబిల్లికి చంద్రయాన్-3 దగ్గరగా వెళ్ళింది.
ఈ నెల 9వ తేదీన మద్యాహ్నం 1-2గంటల ప్రాంతంలో మరోసారి కుదింపు చర్యను చేపట్టి చంద్రుడికి మరింత దగ్గరగా చంద్రయాన్-3 మిషన్ ని తీసుకెళ్ళనున్నారు.
Details
మరో మూడుసార్లు కక్ష్య కుదింపు చర్యలు
ఆగస్టు 17వ తేదీ వరకు మరో మూడు కక్ష్య కుదింపు చర్యలు ఉండనున్నాయని ఇస్రో శాస్త్రవేత్తల్జు తెలియజేస్తున్నారు.
చంద్రుడి దగ్గర వరకు చేరుకున్న తర్వాత ప్రొపుల్సన్ మాడ్యూల్ నుండి ల్యాండర్, రోవర్ వేరుపడతాయి.
ఆ తర్వాత చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అయ్యే వరకు(ఆగస్టు 23) కక్ష్య కుదింపు చర్యలు ల్యాండర్ మీద జరుగుతూనే ఉంటాయట.
చంద్రయాన్-3 మిషన్, చంద్రుడి దక్షిణ ధృవం మీద ల్యాండ్ కానుంది.
2023 జులై 14వ తేదీన ఆంధ్రప్రదేశ్ శ్రీహరి కోట నుండి చంద్రుడి మీదకు ద్రయాన్-3 ప్రయాణం మొదలైంది.