KumbhMela 2025: అంతరిక్షం నుంచి తీసిన మహా కుంభమేళా చిత్రాలను షేర్ చేసిన ఇస్రో
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహా కుంభమేళా (Kumbh Mela 2025)తో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సందడిగా మారింది.
జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు జరుగనున్న ఈ మహా కార్యక్రమంలో 40 కోట్లకుపైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించనున్నారని అంచనా.
ఈ కుంభమేళాకి సంబంధించి ఇస్రో విడుదల చేసిన స్పేస్ వ్యూ చిత్రాలు విశేష దృష్టిని ఆకర్షించాయి.
మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన వివరాలను హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సేకరించిన చిత్రాలు స్పష్టం చేశాయి.
తాత్కాలిక టెంట్ హౌస్‌లు, తేలియాడే వంతెనల ఏర్పాట్ల కారణంగా గత కొన్ని నెలలకూ ఇప్పటి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసిన శివాలయ పార్క్ కూడా ఈ చిత్రాల్లో కనిపించింది.
వివరాలు
వేడుకల ద్వారా 12లక్షల మందికి తాత్కాలిక ఉపాధి
2024 ఏప్రిల్ 6వ తేదీకి తీసిన చిత్రంలో ఆ ప్రాంతం ఖాళీగా ఉండగా,2024 డిసెంబర్ 22,2025 జనవరి 10కి తీసిన చిత్రాల్లో విభిన్న మౌలిక సదుపాయాలు,శివాలయ పార్క్ కూడా కనిపించాయి.
భారతదేశం మ్యాప్ ఆకారంలో అది రూపుదిద్దుకుంది.ఇదే సమయంలో,45 రోజుల పాటు కొనసాగనున్నఈ మేళా ద్వారా రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు రూ.2లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ వేడుకల ద్వారా 12లక్షల మందికి తాత్కాలిక ఉపాధి కల్పించబడుతుందని కూడా వారు తెలిపారు.
మొత్తం 10,000 ఎకరాల విస్తీర్ణంలో కుంభమేళా కోసం ఏర్పాట్లు నిర్వహించామని, ఏ సమయంలోనైనా 50 లక్షల నుంచి 1 కోటి మందికి పవిత్ర స్నానాలు చేయడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇస్రో చేసిన ట్వీట్
ISRO Captures Maha Kumbh Mela from the Skies: A Space View of the World's Largest Pilgrimage Gathering - https://t.co/GPMzxN5B8x pic.twitter.com/srLJkCpYWQ
— Hams Live News (@hamslivenews) January 22, 2025