ISRO YUVIKA 2026 : స్పేస్ సైన్స్ నేర్చుకునే అవకాశం.. యువికా 2026కు దరఖాస్తులు ప్రారంభం.. వెంటనే అప్లయ్ చేసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా 'యువ విజ్ఞాని కార్యక్రమ్ (యువికా)-2026'ను నిర్వహిస్తోంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులకు స్పేస్ టెక్నాలజీ, అంతరిక్ష శాస్త్రం, వాటి అనువర్తనాలపై ప్రాథమిక అవగాహన కల్పించడమే లక్ష్యం. ముఖ్యంగా సాంకేతిక రంగంపై ఆసక్తి ఉన్న చిన్నారులకు ఇది మంచి అవకాశం.
వివరాలు
ఎవరు అర్హులు..?
ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునే వారు జనవరి నాటికి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు కావాలి. దరఖాస్తుల చివరి తేదీ మార్చి 31, 2026గా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులకు మే నెలలో రెండు వారాలపాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణలో భాగంగా ఇస్రో కేంద్రాల్లో ప్రాక్టికల్ సెషన్లు, ప్రాజెక్టులు, అలాగే ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహిస్తారు.
వివరాలు
దరఖాస్తు విధానం ఇలా..
ముందుగా అధికారిక వెబ్‌సైట్ http://jigyasa.iirs.gov.in/youvika లోకి వెళ్లాలి "Apply for YUVIKA Registration" లింక్‌పై క్లిక్ చేయాలి విద్యార్థి పేరు, తండ్రి పేరు, పాఠశాల, రాష్ట్రం, ఈమెయిల్ వంటి వివరాలు నమోదు చేయాలి రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక లాగిన్ వివరాలు జనరేట్ అవుతాయి ఆ వివరాలతో లాగిన్ అయి విద్య, ఇతర సమాచారం నమోదు చేయాలి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి
వివరాలు
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది..?
యువికా-2026 కోసం విద్యార్థుల ఎంపికను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తారు. వివిధ ప్రమాణాల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 8వ తరగతి మార్కులకు 50% వెయిటేజీ ఆన్‌లైన్ క్విజ్‌కు 10% వెయిటేజీ సైన్స్ ప్రదర్శనలు, కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు గత మూడు సంవత్సరాల్లో పాల్గొన్న స్థాయి ఆధారంగా 2% నుంచి 10% వరకు వెయిటేజీ ఇస్తారు అదనంగా: ఒలింపియాడ్స్, క్రీడలు, స్కౌట్స్ అండ్ గైడ్స్, NCC, NSSలో ప్రతిభకు అదనపు మార్కులు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 15% అదనపు వెయిటేజీ ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం కల్పించేలా ఎంపిక
వివరాలు
శిక్షణ ఎక్కడ జరుగుతుంది..?
ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో ప్రధాన కేంద్రాల్లో నిర్వహిస్తారు. ముఖ్యంగా: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ యూ.ఆర్. రావు శాటిలైట్ సెంటర్ ఇవి సహా మొత్తం తొమ్మిది కీలక ఇస్రో కేంద్రాల్లో శిక్షణ అందిస్తారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే — ఎంపికైన విద్యార్థుల కోర్సు మెటీరియల్, వసతి, భోజనం వంటి అన్ని ఖర్చులను ఇస్రోయే భరిస్తుంది.
వివరాలు
విద్యార్థులకు లభించే అవకాశాలు
ఈ ప్రోగ్రామ్‌లో ఎంపికైన వారికి అనేక ప్రత్యేక అవకాశాలు లభిస్తాయి: ఇస్రో శాస్త్రవేత్తలతో నేరుగా మాట్లాడే అవకాశం ల్యాబ్ విజిట్‌లు స్పేస్ టెక్నాలజీ ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం సైన్స్‌లో కెరీర్ చేసేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇది గొప్ప ప్లాట్‌ఫామ్‌గా నిపుణులు భావిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగడానికి మార్గం సుగమమవుతుందని వారు సూచిస్తున్నారు.