Loading...
Jack Dorsey: ఇంటర్నెట్ లేకుండానే మనిషిలా మాట్లాడే AI.. జాక్ డోర్సే కొత్త ప్రయోగం!
ఇంటర్నెట్ లేకుండానే మనిషిలా మాట్లాడే AI.. జాక్ డోర్సే కొత్త ప్రయోగం!

Jack Dorsey: ఇంటర్నెట్ లేకుండానే మనిషిలా మాట్లాడే AI.. జాక్ డోర్సే కొత్త ప్రయోగం!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2026
02:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ట్విట్టర్‌ (ప్రస్తుతం ఎక్స్‌) సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే మరో కొత్త ఏఐ మోడల్‌తో ముందుకొచ్చారు. 'డెస్సా (Dessa)' పేరుతో రూపొందించిన ఈ మోడల్‌ పెద్ద భాషా నమూనాలైన ఎల్‌ఎల్‌ఎంలపై ఆధారపడకుండా పనిచేస్తుంది. మనుషులు మాట్లాడే మాటలను వింటూ భాషను నేర్చుకునేలా దీన్ని రూపొందించారు. సాధారణంగా చాట్‌జీపీటీ, గూగుల్‌ జెమినీ వంటి వాయిస్‌ ఏఐ మోడళ్లు మనం మాట్లాడిన మాటలను ముందుగా టెక్స్ట్‌గా మారుస్తాయి. ఆ తర్వాత వాటిని విశ్లేషించి సమాధానం ఇస్తాయి. అయితే ఈ ప్రక్రియలో భావోద్వేగాలు, వ్యంగ్యం, నవ్వు, మాట్లాడేటప్పుడు సహజంగా తీసుకునే విరామాలు వంటి అంశాలు పూర్తిగా అర్థం కాకపోవచ్చు.

వివరాలు 

ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకుండానే.. ఉపయోగించవచ్చు 

డెస్సా మాత్రం దీనికి భిన్నంగా పనిచేస్తుంది. జాక్‌ డోర్సే సంస్థ బ్లాక్‌కు చెందిన చిన్న ఏఐ పరిశోధన బృందం దీన్ని అభివృద్ధి చేసింది.

మనుషులు రాసిన టెక్స్ట్‌ను చదివి కాకుండా, వారు మాట్లాడే మాటలను వింటూ భాషను నేర్చుకునేలా ఈ మోడల్‌కు శిక్షణ ఇచ్చారు.

ఇది మనుషులతో సహజంగా, వెంటనే మాట్లాడగలదని డెస్సా అభివృద్ధి చేసిన బృందం చెబుతోంది.

మ్యాక్‌బుక్‌ ప్రో ఎం4 మ్యాక్స్‌ లేదా అంతకంటే మెరుగైన కంప్యూటర్‌లో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకుండానే దీన్ని ఉపయోగించవచ్చని వెల్లడించింది.

డెస్సా మనుషులతో మాట్లాడిన కొన్ని నమూనాలను వెబ్‌సైట్‌తో పాటు ఎక్స్‌లోనూ విడుదల చేసింది. వాటిని చూసిన పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

వివరాలు 

ఒకేసారి వినడం.. మాట్లాడటం డెస్సా ప్రత్యేకత

సాధారణ వాయిస్‌ అసిస్టెంట్లు మనం మాట్లాడటం పూర్తయ్యే వరకు వేచి చూసి, ఆ తర్వాత సమాధానం ఇస్తాయి.

కానీ డెస్సా మన మాటలను వింటూనే మాట్లాడగలదు. దీన్ని 'ఫుల్‌ డ్యూప్లెక్స్‌ స్పీచ్‌-టు-స్పీచ్‌' సాంకేతికతగా పిలుస్తారు.

సంభాషణ మధ్యలో సహజంగా స్పందించడం,'అవును','అర్థమైంది' వంటి మాటలతో వెంటనే బదులివ్వడం,ఏదైనా సరదాగా అనిపిస్తే మాట్లాడుతూనే నవ్వడం వంటి లక్షణాలు ఇందులో ఉన్నాయి.

మాటలను టెక్స్ట్‌గా మార్చే సమయంలో కోల్పోయే అవకాశం ఉన్న భావోద్వేగాలు, వ్యంగ్యం, స్వరంలోని మార్పులను కూడా డెస్సా గుర్తించగలదని దీన్ని అభివృద్ధి చేసిన బృందం చెబుతోంది.

ఈ మోడల్‌కు శిక్షణ ఇచ్చేందుకు ఒక ఎన్‌విడియా జీబీ200 ఎన్‌వీఎల్72 వ్యవస్థను ఉపయోగించినట్లు వెల్లడించింది.

ADVERTISEMENT

వివరాలు 

ఇంటర్నెట్‌ లేకుండానే పనిచేస్తుంది: జాక్‌ డోర్సే

శబ్దాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని ఏఐ భాషను, వాస్తవ సమాచారాన్ని ఎలా నేర్చుకోగలదనే అంశంపై పరిశోధనకు డెస్సా కొత్త దారులు చూపిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.

డెస్సా గురించి ఎక్స్‌లో పలువురు అడిగిన ప్రశ్నలకు జాక్‌ డోర్సే సమాధానాలు ఇచ్చారు.

ఈ మోడల్‌ వాయిస్‌ కోసం ఏ భాషా నమూనాను ఉపయోగిస్తోందని ఓ యూజర్‌ అడగ్గా.. 'స్పీచ్‌ టు స్పీచ్‌.. ఎల్‌ఎల్‌ఎం లేదు' అని ఆయన బదులిచ్చారు.

ఇది కంప్యూటర్‌లోనే పనిచేయగలదా అని మరో యూజర్‌ ప్రశ్నించగా.. 'అవును' అని స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

ఇంటర్నెట్‌ లేకుండానే పనిచేస్తుంది: జాక్‌ డోర్సే

ప్రస్తుతం కొంతమంది ఏఐ భద్రతా పరిశోధకులను డెస్సాను పరీక్షించి, అభివృద్ధి చేసినవారు గుర్తించని ప్రమాదాలేమైనా ఉన్నాయో పరిశీలించాలని బృందం ఆహ్వానిస్తోంది.

ఇది ఇంకా ప్రారంభ దశలో ఉన్న పరిశోధన ప్రాజెక్టే. అయినప్పటికీ, ఏఐ మనుషులతో మాట్లాడటం నేర్చుకునే విధానంలో కొత్త ఆలోచనను ముందుకు తెస్తోంది.

ప్రతి విషయాన్ని ముందుగా చదివి నేర్చుకోవడం కాకుండా, మనుషులు ఎలా మాట్లాడుతున్నారో వింటూ భాషను అర్థం చేసుకునే దిశగా ఈ ప్రయోగం సాగుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మనుషుల మాటలు వింటూ నేర్చుకునే ఏఐ

ADVERTISEMENT