చంద్రుడి పైకి ఇస్రో పంపించనున్న చంద్రయాన్ 3 ప్రత్యేకతలు ఏంటి?
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో), చంద్రుడి మీదకు చంద్రయాన్ 3 ని జులై 14వ తేదీన పంపించనుంది. చంద్రుడి పైకి ఇండియా పంపిస్తున్న మూడవ మిషన్ ఇది. 2019 జులై 22వ తేదీన చంద్రయాన్ 2 ని చంద్రుడి పైకి పంపించారు. అయితే చంద్రయాన్ 2 మిషన్, సక్సెస్ ఫుల్ గా చంద్రుడి పై ల్యాండ్ అవలేదు. చంద్రుడి ఉపరితలానికి 2కి.మీ దూరంలో ఉండగా జరిగిన కొన్ని పరిస్థితుల కారణంగా చంద్రుడి ఉపరితలాన్ని చంద్రయాన్ 2 ల్యాండర్ చాలా వేగంగా ఢీకొట్టింది. దానివల్ల చంద్రయాన్ 2 సరిగ్గా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 మధ్య తేడాలు ఏంటో తెలుసుకుందాం.
ల్యాండింగ్ కోసం ప్రత్యేక కెమెరాలు
చంద్రయాన్ 3 లో సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ మార్పులను చేసారు. థ్రస్టర్స్ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి చంద్రయాన్ 2 టైమ్ లో వచ్చిన ప్రాబ్లమ్ రాకుండా తయారు చేసారు. చంద్రయాన్ 3 మిషన్ లో 4థ్రస్టస్ ఇంజిన్స్, బలమైన కాళ్ళు, రెండు పెద్ద సోలార్ ప్యానెల్స్, ఇంధనం మోయడానికి పెద్ద ట్యాంక్ ఉంది. ఈసారి స్మూత్ ల్యాండింగ్ జరగడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసారు. చంద్రయాన్ 3 మిషన్ లో ల్యాండ్ అయ్యేటప్పుడు అక్కడేదైనా అడ్డు తగులుతుందో తెలుసుకోవడానికి కెమెరాస్ ఉన్నాయి. చంద్రయాన్ 2 లో ఇలాంటి కెమెరా ఒక్కటి మాత్రమే ఉండేది.
నాలుగవ దేశంగా భారతదేశం రికార్డు
ఆర్బిటర్ ని చంద్రయాన్ 3 క్యారీ చేయడం లేదు. ప్రపుల్సన్ మాడ్యూల్ అనేది కమ్యూనికేషన్ రిలే సాటిలైట్ లాగా పనిచేస్తుంది. బ్యాకప్ రిలే కోసం చంద్రయాన్ 2 ఆర్బిటార్ మీద ఆధారపడకుండా కమ్యూనికేషన్ రిలే సాటిలైట్ పని చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుండి శుక్రవారం మద్యాహ్నం 2:35నిమిషాలకు ఎల్వీఎమ్ 3 రాకెట్ ద్వారా చంద్రయాన్ 3 మిషన్ లాంచ్ జరుగుతుంది. ఈ మిషన్ విజయవంతం అయితే అమెరికా, రష్యా, చైనా తర్వాత చంద్రుడిపై సేఫ్ ల్యాండ్ చేసిన నాలుగవ దేశంగా భారతదేశం రికార్డు సాధిస్తుంది.