Page Loader
చంద్రయాన్-3కి ముహుర్తం ఖరారు.. జులై 14 మధ్యాహ్నం 2.35 నిమిషాలకు రాకెట్ లాంచ్
జులై 14 మధ్యాహ్నం 2.35 నిమిషాలకు రాకెట్ లాంచ్

చంద్రయాన్-3కి ముహుర్తం ఖరారు.. జులై 14 మధ్యాహ్నం 2.35 నిమిషాలకు రాకెట్ లాంచ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 06, 2023
07:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్- 3ని జూలై 14న మధ్యాహ్నం 2.35 నిమిషాలకి ప్రయోగించనున్నట్లు ట్వీట్టర్ ద్వారా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట కేంద్రంగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV MK -3 రాకెట్‌ ద్వారా చంద్రుడిపైకి పంపనున్నట్లు వివరించింది. చంద్రయాన్-3 మిషన్ ద్వారానే చంద్రుని ఉపరితలంపై రోవర్‌ను ల్యాండింగ్ చేయ‌నుంది. ఉపగ్రహం దాదాపు 3,84,000 కి.మీ. ప్రయాణించి ప్రొపల్షన్ మాడ్యూల్ ల్యాండర్, రోవర్ కాన్ఫిగరేషన్‌ను 100 కిలోమీటర్ల మేర చంద్ర కక్ష్య వరకు మోసుకెళ్తుంది. అనంతరం చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద నిర్దేశిత ప్రాంతంలో రాకెట్ ల్యాండ్ కానున్నట్లు ఇస్రో పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చంద్రయాన్-3 లాంచింగ్ కు ముహుర్తం ఖరారు