PSLV-C59: సాంకేతిక లోపంతో రేపటికి వాయిదా పడిన పీఎస్‌ఎల్‌వీ-సీ59 ప్రయోగం
శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జరగాల్సిన పీఎస్‌ఎల్‌వీ-సీ59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. 25.30 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం బుధవారం సాయంత్రం 4.08 గంటలకు ప్రయోగం చేయాలని నిశ్చయించగా, ఉపగ్రహంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా అది వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ ప్రయోగాన్ని గురువారం సాయంత్రం 4.12 గంటలకు తిరిగి షెడ్యూల్ చేసినట్లు ఇస్రో వెల్లడించింది. పీఎస్‌ఎల్‌వీ-సీ59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.