LOADING...
Lava ProWatch X Smartwatch: మార్కెట్ లోకి లావా కొత్త స్మార్ట్ వాచ్.. ధర ఎంతంటే?
మార్కెట్ లోకి లావా కొత్త స్మార్ట్ వాచ్.. ధర ఎంతంటే?

Lava ProWatch X Smartwatch: మార్కెట్ లోకి లావా కొత్త స్మార్ట్ వాచ్.. ధర ఎంతంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 15, 2025
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్మార్ట్ గాడ్జెట్లు ప్రస్తుతం ట్రెండ్‌లో నిలిచాయి. ఏ వయస్సు వారైనా స్మార్ట్ వాచ్‌లను ఉపయోగిస్తున్నారు. ప్రత్యేకించి, హెల్త్ ఫీచర్లు అందుబాటులో ఉండటం, అలాగే అందకసిగిన ధరల్లో లభించడం వల్ల స్మార్ట్ వాచ్‌ల కొనుగోలు పెరుగుతోంది. తాజాగా, స్మార్ట్ వాచ్ ప్రేమికుల కోసం మరో కొత్త మోడల్ విడుదలైంది. లావా కంపెనీ తన తాజా మోడల్ లావా ప్రోవాచ్ X ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ వాచ్ ఇన్-బిల్ట్ GPS, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. అలాగే SpO2 మానిటరింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్, హెల్త్ ట్రాకింగ్ వంటి పలు ఆరోగ్య పరమైన ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

వివరాలు 

Lava ProWatch X ప్రత్యేకతలు 

లావా ప్రోవాచ్ X 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లే, అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌తో రూపొందించబడింది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 10 రోజుల వరుకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. దుమ్ము, నీటి రక్షణ కోసం IP68 రేటింగ్ కలిగి ఉంది. ఇది మెటల్, నైలాన్, సిలికాన్ స్ట్రాప్ వేరియంట్లలో లభించనుంది. కాస్మిక్ గ్రే రంగులో మాత్రమే ఈ మోడల్ అందుబాటులో ఉంది. భారత మార్కెట్‌లో లావా ప్రోవాచ్ X ధర ₹4,499 గా నిర్ణయించబడింది. ఈ స్మార్ట్‌వాచ్ ఫిబ్రవరి 21 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉంది.

వివరాలు 

ప్రోవాచ్ X పూర్తి స్పెసిఫికేషన్స్ 

డిస్‌ప్లే: 1.43-అంగుళాల (466×466 పిక్సెల్స్) AMOLED స్క్రీన్ ప్రొటెక్షన్: కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 పీక్ బ్రైట్‌నెస్: 500nits పిక్సెల్ డెన్సిటీ: 326ppi రిఫ్రెష్ రేట్: 30Hz ప్రాసెసర్: డ్యూయల్-కోర్ ATD3085C స్పోర్ట్స్ మోడ్‌లు: 110+ ఇంటెలిజెంట్ ఎక్సర్‌సైజ్ రికగ్నిషన్ (IER), ఏరోబిక్ ట్రైనింగ్ ఎఫెక్ట్‌లు హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు: బాడీ ఎనర్జీ మానిటరింగ్ VO2 మ్యాక్స్ HRV పోస్ట్-వర్కౌట్ రికవరీ అనాలిసిస్ SpO2 మానిటరింగ్ స్లీప్ ట్రాకింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ బ్యాటరీ: 300mAh కెపాసిటీ ఈ స్మార్ట్ వాచ్ ఉత్తమ హెల్త్ మానిటరింగ్, స్మార్ట్ కనెక్టివిటీ, మరియు స్టైలిష్ డిజైన్ కలిగి ఉండటంతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.