Apple Stores: ఐఫోన్ 18 ప్రో సిరీస్ కోసం కోసం భారీ క్యూ..12గంటలు వేచి చూసి మరీ ఫోన్ కొన్న కస్టమర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త ఐఫోన్ల కోసం భారత్లోని ఆపిల్ స్టోర్ల ముందు భారీగా జనం క్యూ కట్టారు. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ విక్రయాలు శుక్రవారం ప్రారంభం కావడంతో ముంబై, బెంగళూరు, నోయిడా సహా పలు నగరాల్లోని ఆపిల్ స్టోర్ల వద్ద సందడి నెలకొంది. ప్రస్తుతం ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఆపిల్ ఆన్లైన్ స్టోర్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆరు రిటైల్ స్టోర్లలో వీటి విక్రయాలు ప్రారంభమయ్యాయి.
వివరాలు
10-12 గంటలు క్యూలోనే..
మహారాష్ట్రలో ఓ కస్టమర్ మొదటి ఐఫోన్ను దక్కించుకోవాలనే ఉద్దేశంతో దాదాపు 10 నుంచి 12 గంటల పాటు క్యూలో వేచి చూశాడు.
చివరకు ఫోన్ చేతికి రావడంతో ఎంతో ఉత్సాహంగా ఉందని అతడు చెప్పాడు.
బెంగళూరుకు చెందిన రాహుల్ ఉదయం 5 గంటలకే యాపిల్ స్టోర్కు చేరుకున్నాడు.
ఐఫోన్ 7 నుంచి ప్రతి కొత్త మోడల్ను కొనుగోలు చేస్తున్నానని తెలిపాడు. ప్రతి ఏడాది ఐఫోన్ లాంచ్ను ఓ పండుగలా భావిస్తానని చెప్పాడు.
హర్యానా,ఢిల్లీ,ముంబై నుంచి కూడా కొందరు ఐఫోన్ కొనుగోలు చేసేందుకు వచ్చారని పేర్కొన్నాడు.
నోయిడాలో ఓ కస్టమర్ ఉదయం 6 గంటల నుంచే క్యూలో నిల్చుని ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ను తొలుత దక్కించుకున్నాడు.
వివరాలు
ఐఫోన్ 18 ప్రో సిరీస్లో కొత్త ఫీచర్లు
గతంలో ఐఫోన్ 13 వాడేవాడినని, కొత్త ఫీచర్ల కారణంగా ఈసారి అప్గ్రేడ్ చేసుకోవడం విలువైనదేనని అతడు అభిప్రాయపడ్డాడు.
ఐఫోన్ 18 ప్రోలో 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ మెయిన్ కెమెరా, వేరియబుల్ అపెర్చర్, కొత్త ప్రో కెమెరా కంట్రోల్స్ ఉన్నాయి.
ఏ20 ప్రో చిప్తో పాటు కొత్త వేపర్ ఛాంబర్ను కూడా ఇందులో అందించారు. ఈ ఫోన్లు బ్లాక్, సిల్వర్, గ్లేసియర్, బర్గండీ రంగుల్లో లభిస్తున్నాయి.
ధరలు ఇలా..
ఐఫోన్ 18 ప్రో 256జీబీ మోడల్ ధర రూ.1,64,900 నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 256జీబీ మోడల్ ధర రూ.1,79,900గా ఉంది.
గరిష్ఠంగా 2టీబీ స్టోరేజ్ మోడళ్ల ధరలు వరుసగా రూ.3,14,900, రూ.3,29,900 వరకు ఉన్నాయి.
వివరాలు
కొత్త ఎయిర్పాడ్స్, ఆపిల్ వాచ్లు కూడా..
ఇదే సమయంలో యాపిల్ కొత్త ఎయిర్పాడ్స్ 5, ఆపిల్ వాచ్ సిరీస్ 12, యాపిల్ వాచ్ అల్ట్రా 4ను కూడా తీసుకొచ్చింది.
సంస్థ తొలిసారి ఫోల్డబుల్ ఐఫోన్ 'ఐఫోన్ డ్యుయో'ను ప్రకటించింది. భారత్లో దీని ప్రారంభ ధర రూ.2,99,900గా ఉంది.
ఈ ఫోన్కు ప్రీ-ఆర్డర్లు అక్టోబర్ 16న సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 23 నుంచి విక్రయాలు మొదలవుతాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ కోసం తెల్లవారుజామునే క్యూ..
VIDEO | Delhi: People line up outside Apple Store at Select Citywalk Mall ahead of the official sales launch of the iPhone 18 Pro and iPhone 18 Pro Max in India.#Apple #iPhone18Pro
— Press Trust of India (@PTI_News) September 18, 2026
(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/8PXqrTlwS2