Meta: డెవలపర్ల కోసం 'మ్యూస్ స్పార్క్' ఏఐ మోడల్ విడుదల వాయిదా వేసిన మెటా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ప్రముఖ టెక్నాలజీ సంస్థ మెటా తన తాజా 'మ్యూస్ స్పార్క్'(Muse Spark) ఏఐ మోడల్ APIని డెవలపర్ల కోసం విడుదల చేయడాన్ని వాయిదా వేసింది. ఈ విషయాన్ని The Wall Street Journal సంబంధిత వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ వెల్లడించింది. ప్రస్తుతం ఈ API విడుదలకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని మెటా ప్రకటించలేదు. అయితే,ఈ నెలలోనే మ్యూస్ స్పార్క్ APIని విడుదల చేసే యోచనలో ఉన్నామని మెటా ప్రతినిధి Reuters కు తెలిపారు. ప్రస్తుతం కొంతమంది ఎంపిక చేసిన భాగస్వాములతో ఈ మోడల్‌ను పరీక్షిస్తున్నట్లు వెల్లడించారు. మెటా ఈ ఏడాది ఏప్రిల్‌లో మ్యూస్ స్పార్క్‌ను పరిచయం చేసింది. కృత్రిమ మేధస్సు(AI)రంగంలో ఇతర కంపెనీలకు పోటీగా రూపొందించిన తొలి మోడల్‌గా దీనిని ప్రకటించింది.
వివరాలు
వ్యాపారాల రోజువారీ కార్యకలాపాలలో సహాయపడే AI ఏజెంట్
ఈ మోడల్‌ను మెటా కొత్తగా ఏర్పాటు చేసిన Superintelligence Labs అభివృద్ధి చేసింది. "మ్యూస్ స్పార్క్ API త్వరలో అందుబాటులోకి వస్తుంది" అని మెటా ఏఐ విభాగాధిపతి Alexandr Wang గత ఏప్రిల్‌లో ఎక్స్ (X) వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉండగా, వ్యాపార సంస్థల రోజువారీ కార్యకలాపాలకు సహాయపడే కొత్త ఏఐ ఏజెంట్‌ను కూడా మెటా బుధవారం ప్రారంభించింది. ఈ చర్య ద్వారా OpenAI, Anthropic, అలాగే Alphabet వంటి సంస్థలకు గట్టి పోటీ ఇవ్వాలన్న లక్ష్యాన్ని మెటా స్పష్టం చేసింది. వివిధ రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని మరింత విస్తరించేందుకు కంపెనీ కట్టుబడి ఉందనే సంకేతాలను ఈ కొత్త ఏఐ సాధనం ఇస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.