LOADING...
భారత్‌లోనూ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ ప్రకటన రహిత సేవలకు మెటా శ్రీకారం
ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ ప్రకటన రహిత సేవలకు మెటా శ్రీకారం

భారత్‌లోనూ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ ప్రకటన రహిత సేవలకు మెటా శ్రీకారం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 09, 2023
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు దాని మాతృసంస్థ మెటా షాక్ ఇవ్వనుంది. ఇకపై ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా ప్రకటనలు లేకుండా వినియోగించాలంటే నెల నెలా కొంత చెల్లించాలి. ఈ మేరకు వచ్చే సంవత్సరం నుంచి ఈ నూతన ప్లాన్లను తెచ్చేందుకు మెటా సన్నద్ధమవుతోందని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది. యూరోపియన్‌ నిబంధనలకు అనుగుణంగా యాడ్‌ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ (ADD FREE SUBCSRIPTION PLAN)ను మెటా రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే 2024 నుంచి యాడ్‌ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను తేనున్నట్లు సమాచారం. మరోవైపు ప్రకటనలు వచ్చినా పర్వాలేదనుకుంటేనే ఈ సేవలు ఉచితంగా పొందుతారు. ఇన్నాళ్లూ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌ సేవలను మెటా ఉచితంగా అందిస్తూ వచ్చింది.

detaills

మెటాకు భారీ జరిమానా విధించిన ఐర్లాండ్‌ ప్రైవసీ కమిషనర్‌

ఇకపై భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఛార్జ్ వసూలు చేయాలని మెటా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలకు యాడ్‌ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ తీసుకొస్తోంది. 2024 మధ్యలో గానీ, చివరలో గానీ ఈ కొత్త ప్లాన్ ను కంపెనీ తీసుకురానుంది. యూజర్‌ అనుమతి లేకుండా ప్రకటనలు పంపడంపై ఐర్లాండ్‌ ప్రైవసీ కమిషనర్‌ మెటాకు భారీ జరిమానా విధించారు. యూజర్ పర్సనల్‌ డేటాను వినియోగించుకుని ప్రకటనలు పంపించాలంటే ఇకపై వారి అనుమతి తీసుకోవాలి. లేనిపక్షంలో యాడ్‌ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ స్వీకరించాల్సి ఉంటుంది. ఇన్‌స్టా యాడ్‌ ఫ్రీ వెర్షన్‌ కోసం ప్రతి నెలా 14 డాలర్లు, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా యాడ్‌ ఫ్రీ డెస్క్‌టాప్‌ వెర్షన్‌ వినియోగానికి 17 డాలర్లు విధించాలని మోటా భావిస్తోంది.