
Meta: బ్రెజిల్‌లో మెటా AI బాట్స్‌పై ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
బ్రెజిల్ ప్రభుత్వం, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ మదర్ కంపెనీ అయిన మెటాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పిల్లల లాగా మాట్లాడే శైలిని అనుకరించి, అసభ్యకర సంభాషణలు జరిపే జెనరేటివ్ AI బాట్స్ను వెంటనే తొలగించాలని కోరింది. ఈ విషయంపై బ్రెజిల్ అటార్నీ జనరల్ ఆఫీస్ (AGU) మెటాకు ఒక "ఎక్స్‌ట్రాజుడీషియల్ నోటీస్" జారీ చేసింది. పిల్లల ఎరోటిసైజేషన్‌కి ఇవి కారణమవుతున్నాయని AGU తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గత జూన్‌లో బ్రెజిల్ సుప్రీంకోర్టు, వినియోగదారులు సృష్టించే కంటెంట్‌పై టెక్ కంపెనీల బాధ్యత పెంచేలా ఓటు వేసిన విషయం తెలిసిందే.
ప్లాట్‌ఫారమ్ లక్షణాలు
బాట్లను వెంటనే తొలగించాలని AGU డిమాండ్
మెటా ప్లాట్‌ఫారమ్‌లైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా వినియోగదారులు AI స్టూడియో అనే జెనరేటివ్ టూల్ ఉపయోగించి ఇలాంటి బాట్స్ సృష్టించుకోవచ్చు. అయితే ఇవి చిన్నారుల వేషధారణలో, వారి మాటతీరు పోలి ఉండేలా కనిపిస్తూ, అశ్లీల సంభాషణలు జరిపే అవకాశం కలిగిస్తాయని AGU ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే వెంటనే ఇవి తొలగించాలని డిమాండ్ చేసింది.
ఆధారాలు సమర్పించారు
నోటీసులో స్పష్టమైన ఉదాహరణలు
మెటాకు పంపిన నోటీసులో, చిన్నారులుగా నటించే బాట్స్‌తో జరిగిన అసభ్యకర సంభాషణల ఉదాహరణలు కూడా చేర్చినట్లు AGU తెలిపింది. ఈ డిమాండ్‌లో ఎలాంటి జరిమానాలు లేకపోయినా, బ్రెజిల్‌లోని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులు సృష్టించే చట్టవిరుద్ధ కంటెంట్ తొలగించాల్సిన బాధ్యత తమదే అని నోటీసులో గుర్తుచేసింది. ఇదే సమయంలో, ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్ హైటాలో సాంటోస్‌పై చిన్నారుల లైంగిక దోపిడీ ఆరోపణలు రావడంతో ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతున్నది.