Loading...
Microsoft: మైక్రోసాఫ్ట్‌ అధికారిక ఎక్స్‌ ఖాతా హ్యాక్‌.. కలకలం రేపిన పోస్టులు
మైక్రోసాఫ్ట్‌ అధికారిక ఎక్స్‌ ఖాతా హ్యాక్‌.. కలకలం రేపిన పోస్టులు

Microsoft: మైక్రోసాఫ్ట్‌ అధికారిక ఎక్స్‌ ఖాతా హ్యాక్‌.. కలకలం రేపిన పోస్టులు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2026
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

మైక్రోసాఫ్ట్‌ అధికారిక ఎక్స్‌ (గతంలో ట్విటర్‌) ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని సంస్థ స్వయంగా ధ్రువీకరించింది. శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఖాతా నుంచి మైక్రోసాఫ్ట్‌కు సంబంధం లేని కొన్ని పోస్టులు కనిపించడంతో ఈ వ్యవహారం బయటపడింది.

వివరాలు 

అసలేం జరిగింది?

ఖాతాను అనధికారికంగా యాక్సెస్‌ చేసిన సమయంలో.. 'క్లిప్పీ'కి సంబంధించిన ఓ క్రిప్టో ఖాతాను మైక్రోసాఫ్ట్‌ అధికారిక ఎక్స్‌ అకౌంట్‌ ఫాలో అయింది.

అంతేకాకుండా ఆ ఖాతా చేసిన ఓ పోస్టును రీపోస్ట్‌ చేసింది. ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్‌ ప్రొఫైల్‌ ఫొటోను కూడా క్లిప్పీ థీమ్‌తో కూడిన చిత్రంగా మార్చారు.

ఆ తర్వాత ఆ పోస్టులను తొలగించారు. సుమారు 30 నిమిషాల తర్వాత మైక్రోసాఫ్ట్‌ ఖాతాలో ఓ అసాధారణమైన 'క్షమాపణ' పోస్టు కూడా కనిపించింది.

అయితే దానిని కూడా కొద్దిసేపటికే తొలగించారు. దీంతో మైక్రోసాఫ్ట్‌ ఎక్స్‌ ఖాతా హ్యాకింగ్‌కు గురైనట్లు స్పష్టమైంది.

వివరాలు 

ఖాతా ఇప్పుడు సురక్షితంగా ఉంది: మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధి బ్రెంట్‌ కోల్‌బర్న్‌ ఈ ఘటనపై స్పందించారు. తమ ఎక్స్‌ ఖాతాకు అనధికారికంగా యాక్సెస్‌ జరిగినట్లు నిర్ధారించామని తెలిపారు.

మైక్రోసాఫ్ట్‌ నుంచి రాని కొన్ని పోస్టులు ఖాతాలో ప్రచురితమైనట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఖాతాను తిరిగి సురక్షితం చేశామని కోల్‌బర్న్‌ తెలిపారు.

అనధికారికంగా చేసిన అన్ని పోస్టులను తొలగించినట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది.

ADVERTISEMENT