NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Motorola Edge 60 Fusion: మోటో ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌ లాంచ్‌.. కర్వ్‌ డిస్‌ప్లే, 50MP కెమెరా, 5500mAh బ్యాటరీ!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Motorola Edge 60 Fusion: మోటో ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌ లాంచ్‌.. కర్వ్‌ డిస్‌ప్లే, 50MP కెమెరా, 5500mAh బ్యాటరీ!
    మోటో ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌ లాంచ్‌.. కర్వ్‌ డిస్‌ప్లే, 50MP కెమెరా, 5500mAh బ్యాటరీ!

    Motorola Edge 60 Fusion: మోటో ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌ లాంచ్‌.. కర్వ్‌ డిస్‌ప్లే, 50MP కెమెరా, 5500mAh బ్యాటరీ!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 02, 2025
    02:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మోటోరోలా తన ఎడ్జ్‌ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. గతేడాది విడుదల చేసిన ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌కు కొనసాగింపుగా, తాజాగా ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

    5500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 68W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

    మోటో ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌ ప్రత్యేకతలు

    ఈ ఫోన్‌లో 6.70 అంగుళాల 1.5కె ఆల్‌ కర్వ్‌డ్‌ పీఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

    120Hz రిఫ్రెష్‌ రేటుతో పాటు, 4,500 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్, హెచ్‌డీఆర్‌ 10+ సపోర్ట్ ఉంది. డిస్‌ప్లేకు కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7ఐ ప్రొటెక్షన్‌ను అందించారు.

    Details

     కెమెరా ఫీచర్లు 

    ఇందులో మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఔట్ ఆఫ్‌ ది బాక్స్‌ ఆండ్రాయిడ్‌ 15 హలో యూఐతో పనిచేస్తుంది.

    కంపెనీ ప్రకారం మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నారు.

    కెమెరా పరంగా 50MP సోనీ ఎల్‌వైటీ 700సీ ప్రధాన కెమెరా అందించారు. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉంది. అదనంగా 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు.

    సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ కెమెరాతో 4కె వీడియో రికార్డింగ్ చేయవచ్చు.

    మోటో ఏఐ ఆధారంగా ఫొటో ఎన్‌హ్యాన్స్‌మెంట్‌, అడాప్టివ్‌ స్టెబిలైజేషన్‌, మ్యాజిక్‌ ఎరేజర్‌ వంటి ప్రత్యేకమైన ఫీచర్లను అందించారు.

    Details

    కనెక్టివిటీ & బ్యాటరీ 

    అదనంగా గూగుల్‌ సర్కిల్‌ సెర్చ్‌, మోటో సెక్యూర్‌ 3.0, స్మార్ట్‌ కనెక్ట్‌ 2.0, ఫ్యామిలీ స్పేస్‌ 3.0, మోటో గెశ్చర్‌ వంటి ప్రత్యేకమైన ఫీచర్లు ఈ ఫోన్‌లో లభిస్తాయి. డాల్బీ అట్మాస్‌ స్టీరియో స్పీకర్లు అదనపు ఆకర్షణ.

    5G, 4G LTE, డ్యూయల్‌-బాండ్‌ వైఫై, బ్లూటూత్‌ 5.4, GPS, NFC, USB టైప్‌-C పోర్ట్‌ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు అందించారు.

    5500mAh బ్యాటరీతో పాటు, 68W వైర్డ్‌ టర్బో ఛార్జింగ్‌ సపోర్ట్ ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్, IP68, IP69 డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ ఫీచర్లుగా ఉన్నాయి.

    Details

    ధర & లభ్యత 

    మోటోరోలా ఈ ఫోన్‌ను రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది.

    8GB + 256GB వేరియంట్‌ ధర రూ. 22,999 ఉండగా, 12GB + 256GB వేరియంట్‌ ధర రూ. 24,999గా ఉంది.

    ఈ ఫోన్ ఏప్రిల్‌ 9న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులోకి రానుంది

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మోటోరోలా

    తాజా

    Shilpa shirodkar: కొవిడ్‌ బారిన పడిన బాలీవుడ్‌ నటి శిల్పా శిరోద్కర్‌.. సోషల్‌ మీడియాలో పోస్టు  బాలీవుడ్
    HariHara VeeraMallu : హరిహర వీరమల్లు నుంచి మూడో సాంగ్.. రిలీజ్ ఎప్పుడో తెలుసా? హరిహర వీరమల్లు
    Jaish-e-Mohammed: జైషే మహ్మద్ ఎలా పుట్టింది? దాని పేరు ప్రతిసారి ఎందుకు మారుతూనే ఉంది? జైషే మహ్మద్
    Pakistan Team: కొత్త కోచ్ మైక్ హెస్సన్ రాగానే పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ డ్రామా షురూ పాకిస్థాన్

    మోటోరోలా

    భారతదేశంలో మోటోరోలాతో 5G భాగస్వామ్యాన్ని ప్రకటించిన వోడాఫోన్ ఐడియా వోడాఫోన్
    మార్కెట్లో అతి తక్కువ ధరకు Moto E13 ఫోన్ విడుదల చేసిన మోటోరోలా ప్రకటన
    భారతదేశంలో మార్చి 16న రానున్న Moto G73 భారతదేశం
    Motorola RAZR 50 Ultra : జూలై 4న ఇండియాలో లాంచ్ కి సిద్ధంగా ఉన్న Motorola RAZR 50 Ultra  టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025