Page Loader
Sunita Williams: అంతరిక్ష యాత్రలో సమోసాలు తీసుకువెళ్లిన సునీతా విలియమ్స్ 
Sunita Williams: అంతరిక్ష యాత్రలో సమోసాలు తీసుకువెళ్లిన సునీతా విలియమ్స్

Sunita Williams: అంతరిక్ష యాత్రలో సమోసాలు తీసుకువెళ్లిన సునీతా విలియమ్స్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 07, 2024
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ-సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష కేంద్రం (ISS) చేరుకున్నారు. ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు సైతం ప్రయాణించిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌక గురువారం విజయవంతంగా ISSకు అనుసంధానమైంది. ఈ సందర్భంగా వ్యోమగాములకు అక్కడ ఘన స్వాగతం లభించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం.. గంటకొట్టి వారిని ఆహ్వానించారు.

డాన్స్ 

అంతరిక్షంలో నృత్యం చేసిన సునీతా విలియమ్స్ 

ఈ సందర్భంగా ISS కు చేరుకున్న సునీత అనడంతో డ్యాన్స్‌ చేశారు. అక్కడే ఉన్న మరో ఏడుగురు వ్యోమగాములను హాగ్ చేసుకొని తన సంతోషాన్ని వ్యక్తపర్చారు. దీనికి సంబంధించిన వీడియోను బోయింగ్‌ స్పేస్‌ తన ఎక్స్‌ ఖాతాలో పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐఎస్‌ఎస్‌లో ఉన్న వారంతా తన కుటుంబ సభ్యులేనని పేర్కొన్నారు. వారిని కలవడంతోనే తాను ఆ విధంగా వేడుక చేసుకున్నానని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బోయింగ్‌ స్పేస్‌ చేసిన ట్వీట్ 

హీలియం లీకేజ్ 

వ్యోమనౌకలో చాల హీలియం నిల్వలు 

బోయింగ్‌ సంస్థ రూపొందించిన స్టార్‌లైనర్‌కు ఇది మొదటి మానవసహిత యాత్ర. అంతకుముందు హీలియం లీకేజీ కారణంగా వ్యోమనౌకలోని గైడెన్స్‌-కంట్రోల్‌ థ్రస్టర్లలో సమస్యలు తలెత్తాయి. ఫలితంగా గంట ఆలస్యమైనప్పటికీ.. ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం అయ్యింది . ISSకు చేరే క్రమంలో వ్యోమనౌకలోని నియంత్రణ వ్యవస్థలను సునీత, విల్‌మోర్‌లు పరీక్షించారు. మార్గమధ్యంలోనూ ఈ క్యాప్సూల్‌ను హీలియం లీకేజీ సమస్య వారిని వేధించింది. అయితే దీనివల్ల వ్యోమగాములకు ఎలాంటి ఇబ్బంది లేదని బోయింగ్‌ ప్రతినిధి తెలిపారు. వ్యోమనౌకలో చాల హీలియం నిల్వలు ఉన్నాయని తెలిపారు.

సునీత 

సునీతా విలియమ్స్‌కు మూడో రోదసి యాత్ర

సునీతా విలియమ్స్‌కు ఇది మూడో రోదసి యాత్ర. అంతకముందు ఆమె 2006, 2012లో ISSకు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్‌ నిర్వహించారు. 322 రోజలపాటు స్పేస్ లో గడిపారు. ఆమె ఒక మారథాన్‌ రన్నర్‌. ISSలో ఓసారి మారథాన్‌ కూడా చేశారు. మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీత, సమోసాను తీసుకెళ్లారు. ఈసారి గణేశుడి విగ్రహాన్ని తీసుకెళ్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.