20 మిలియన్ సూర్యుల బరువుతో సమానమైన బ్లాక్ హోల్‌ను గుర్తించిన నాసా
నాసాకు చెందిన అత్యంత శక్తిమంతమైన హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్‌ను గుర్తించింది. ఇలాంటి బ్లాక్ హోల్‌ను గతంలో ఎన్నడూ చూడలేదని నాసా పరిశోధకులు చెప్పారు. మాసివ్ బ్లాక్ హోల్ చాలా వేగంగా అంతరిక్షంలోకి దూసుకుపోతుందని వెల్లడించారు. అది కనుక మన సౌర వ్యవస్థలో అది భూమి నుంచి చంద్రుని కక్ష్యలోని కేవలం 14 నిమిషాల్లో ప్రయాణించగలదని శాస్త్రవేత్తే పేర్కొన్నారు. సింపుల్‌గా చెప్పాలంటే మనం టిఫిన్ చేసేంత సమయంలో భూమి నుంచి చద్రుని మధ్య ప్రయాణిస్తుందని చెప్పారు. ఇక దీని బరువు దాదాపు సుమారు 20 మిలియన్ సూర్యులతో సమానంగా ఉంటుందని నాసా అంచనా వేసింది.
భూమికి ఎలాంటి నష్టం లేదు: నాసా
బ్లాక్ హోల్ తదనంతర పరిణామాలపై ఆలోచిస్తున్నట్లు యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన పీటర్ వాన్ డొక్కుమ్ చెప్పారు. బ్లాక్ హోల్‌లో వాయువు చల్లబడి నక్షత్రాలను ఏర్పరుస్తుందని పేర్కొన్నారు. బ్లాక్ హోల్ కదలిక వల్ల బహుశా గ్యాస్ పేలడమో, వేడెక్కడమో జరుగుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. రెండు గెలాక్సీలు దాదాపు 50 మిలియన్ సంవత్సరాల క్రితం విలీనం కావడం వల్ల జరిగిన తదనతర పరిణాల నేపథ్యంలో బ్లాక్ హోలో ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్త చెబుతున్నారు. మాసివ్ బ్లాక్ హోల్ అనేది చాలా దూరంలో ఉండటం వల్ల భూమికి దీని వల్ల వచ్చే నష్టం లేదని నాసా పరిశోధకులు అంచనా వేస్తున్నారు.