NASA Mars Missions: నాసా మార్స్ మిషన్లకు సాంకేతిక సమస్యలు.. ఆఫ్‌లైన్‌లోకి రోవర్, ఆర్బిటర్
ఈ వార్తాకథనం ఏంటి
మార్స్‌పై దాదాపు ఆరేళ్లుగా పరిశోధనలు చేస్తున్న పెర్సెవరెన్స్ రోవర్‌కు సమాచార ప్రసార వ్యవస్థలో సమస్య తలెత్తింది. భూమికి డేటాను పంపేందుకు ఈ రోవర్‌లో రెండు UHF రేడియోలు ఉన్నాయి. ఇవి మార్స్ చుట్టూ తిరిగే ఆర్బిటర్ల ద్వారా సమాచారాన్ని భూమికి చేరవేస్తాయి. అయితే అక్టోబర్ 30న ఒక రేడియో స్పందించడం ఆపేసింది. దీంతో రోవర్ ఆటోమేటిక్‌గా మరో రేడియోకు మారి సేఫ్ మోడ్‌లోకి వెళ్లింది. పరిశీలనలో బ్యాకప్ రేడియో కూడా సాధారణ సామర్థ్యంలో సగం శక్తితోనే సిగ్నల్స్ పంపుతున్నట్లు గుర్తించారు.
Details
ఒడిస్సీ ఆర్బిటర్‌కు మరింత తీవ్రమైన సమస్య
2001 నుంచి మార్స్ చుట్టూ పరిభ్రమిస్తున్న ఒడిస్సీ ఆర్బిటర్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది.
అంతరిక్ష నౌక దిశను నియంత్రించే నాలుగు రియాక్షన్ వీల్స్‌లో ఒకటి నవంబర్ ప్రారంభంలో పనిచేయడం ఆపేసింది.
2013లోనే మరో వీల్ పనిచేయకపోవడంతో ప్రస్తుతం రెండు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
సరైన దిశలో ఉండేందుకు కనీసం మూడు వీల్స్ అవసరం. దీంతో ఒడిస్సీ స్థిరత్వం కోసం హైడ్రజీన్ థ్రస్టర్లపై ఆధారపడాల్సి వస్తోంది.
Details
మార్స్ మిషన్ల డేటా ప్రసారంపై ప్రభావం
పెర్సెవరెన్స్, ఒడిస్సీ సమస్యలు మార్స్ నుంచి భూమికి జరిగే సమాచార ప్రసారంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఉపరితలంపై ఉన్న రోవర్ల నుంచి డేటాను సేకరించి భూమికి పంపే నాలుగు ఆర్బిటర్ల వ్యవస్థలో ఒడిస్సీ కూడా భాగం.
ఈ నెట్‌వర్క్‌లో నాసాకు చెందిన మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్‌తో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్, మార్స్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి.
Details
మావెన్‌తోనూ గతంలో సమస్యలు.. కొత్త మిషన్లకు సిద్ధం
గత డిసెంబర్‌లో 11 ఏళ్లుగా మార్స్ వద్ద పనిచేస్తున్న నాసా మావెన్ ఆర్బిటర్‌తో సంబంధాలు తెగిపోయాయి.
రేడియేషన్ ప్రభావం లేదా సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగా దాని కంప్యూటర్ రీస్టార్ట్ అయి అంతరిక్ష నౌక అదుపు తప్పినట్లు భావిస్తున్నారు.
ఇలాంటి సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ మార్స్‌కు మరిన్ని మిషన్లు పంపేందుకు నాసా సిద్ధమవుతోంది.
మార్స్ టెలికమ్యూనికేషన్స్ నెట్‌వర్క్ (MTN), స్కైఫాల్ వంటి ప్రాజెక్టుల ద్వారా భవిష్యత్తులో సమాచార ప్రసార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.