
నాసా: JWST టెలిస్కోప్ సాయంతో బృహస్పతి గ్రహం రెండు చంద్రుళ్ళ మీద రసాయనాల గుర్తింపు
ఈ వార్తాకథనం ఏంటి
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సాయంతో బృహస్పతి(Jupiter) గ్రహ చంద్రుళ్ళు లో, గనిమీడ్ గురించిన సమాచారాన్ని నాసా కనుక్కుంది.
బృహస్పతి చంద్రుడైన లో ఉపరితలంపై సల్ఫర్ మోనాక్సైడ్ ఉందని నాసా గుర్తించింది. అలాగే సౌరకుటుంబంలోనే అతిపెద్ద చుంద్రుడైన గనిమీడ్ పై హైడ్రోజన్ పెరాక్సైడ్ ని నాసా గుర్తించింది.
రేడియోలిసిస్ కారణంగా హైడ్రోజన్ పెరాక్సైడ్:
గనీమీడ్ పై హైడ్రోజన్ పెరాక్సైడ్ రసాయనంమ్ ఏర్పడటానికి కారణం, చార్జ్ చేయబడిన కణాలు నీటి అణువులను విడుదల చేయడమేనని నాసా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.
చంద్రుడి అయస్కాంత క్షేత్రం కారణంగా గనిమీడ్ ధృవ ప్రాంతాల్లో పైన తెలిపిన ప్రాసెస్ జరిగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
Details
లో చంద్రుడిపై అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల సల్ఫర్ మోనాక్సైడ్
బృహస్పతి నీడలో తిరిగే లో చంద్రుడిపై రెండు అగ్నిపర్వతాలు ఉన్నాయని టెలిస్కోప్ సాయంతో తెలుసుకున్నారు.
లోకి పరేటా, కనెహికిలి ఫ్లక్టస్ అనే పేర్లు గల రెండు అగ్ని పర్వతాలు కనిష్టంగా 925డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి.
కనెహికిలి ఫ్లక్టస్ అగ్ని పర్వతం బద్దలైనపుడు సల్ఫర్ మోనాక్సైడ్ ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
అగ్నిపర్వతం బద్దలవ్వడానికి కారణం టైడల్ హీట్ కారణమని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.
టైడల్ హీటింగ్ అనేది అత్యధిక పెద్దదైన వస్తువు చిన్నదాని మీద చూపించే గురుత్వాకర్షణ బలం కారణంగా చిన్నవస్తువు విస్తరించడం, లేదా కుచించుకుపోవడం జరుగుతుంది. ఈ సమయంలోనే ఉష్ణోగ్రత ఉత్పత్తి అవుతుంది.
పైన చెప్పిన ప్రక్రియ, బృహస్పతి, లో మధ్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు.