తెలుగు దేశం పార్టీ/టీడీపీ: వార్తలు
24 Mar 2023
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిచంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి శుక్రవారం టీడీపీలో చేరారు.
20 Mar 2023
ఆంధ్రప్రదేశ్ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా?
ఆంధ్రప్రదేశ్‌లోని 3 గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఉత్తరాంధ్ర(శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం), తూర్పు రాయలసీమ(ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు), పశ్చిమ రాయలసీమ(కడప-అనంతపురం-కర్నూలు)పట్టభద్రల స్థానాల్లో వైసీపీ అనూహ్య పరాభవం ఎదురైంది.
20 Mar 2023
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలుఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం; ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు.
14 Mar 2023
తెలంగాణమాజీ మంత్రి విజయరామారావు కన్నుమూత; సీఎం కేసీఆర్ సంతాపం
సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి విజయరామారావు(84) కన్నుమూశారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో విజయరామారావు మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
02 Mar 2023
ఆంధ్రప్రదేశ్టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (65) కన్నుమూశారు. ఆయన గత జనవరిలో గుండెపోటుకు గురయ్యారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు.
25 Feb 2023
జూనియర్ ఎన్టీఆర్జూనియర్ ఎన్టీఆర్- నారా లోకేశ్ మధ్య ఓటింగ్ పెట్టాలి: కొడాలి నాని
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో మార్పు కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానించారు లోకేశ్. అయితే ఎన్టీఆర్ మాజీ సన్నిహితుడు, మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో స్పందించారు.
24 Feb 2023
ఆంధ్రప్రదేశ్అమరావతి భూముల కేసు: హైదరాబాద్‌లో మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో సీఐడీ సోదాలు
అమరావతి భూముల కేసులో మాజీ మంత్రి పి.నారాయణ కుమార్తె నివాసంలో ఆంధ్రప్రదేశ్ నేరపరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. మాదాపూర్‌లో ఉంటున్న ఆమె ఇంట్లో ఉదయం నుంచి సీఐడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
23 Feb 2023
చంద్రబాబు నాయుడుచంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.
23 Feb 2023
గన్నవరంగన్నవరం ఘర్షణ: రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ నేత పట్టాభి
గన్నవరం ఘటనలో పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని న్యాయమూర్తి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.
21 Feb 2023
గన్నవరంపట్టాభిని పోలీసులు చిత్రహింసలు పెట్టారా? జడ్జి ఎదుట టీడీపీ నేతలు హాజరు
గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ- టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో పట్టాభితో పాటు మరో 11మంది టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
21 Feb 2023
గన్నవరం'24గంటలుగా నా భర్త కనిపించడం లేదు'; టీడీపీ నేత పట్టాభి భార్య నిరసన
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మద్దతుదారులు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ ఎపిసోడ్‌తో కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది.
21 Feb 2023
గన్నవరంటీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్య ఘర్షణ: గన్నవరంలో హైటెన్షన్, పోలీసుల ఆంక్షలు
గన్నవరం నియోజకవర్గంలో మంగళవారం కూడా టీడీపీ, వైఎస్సార్సీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. గన్నవరం ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తూ ఇతర ప్రాంతాల ప్రజలను నియోజకవర్గంలోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.
18 Feb 2023
చంద్రబాబు నాయుడుకేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస
సమకాలీన రాజకీయ నాయకులపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ టాక్ షోకి హాజరైన రాజకీయాలు, సినిమా, స్టూడెంట్ లైఫ్ లాంటి పలు విషయాలపై చంద్రబాబు మాట్లాడారు.
16 Feb 2023
బీజేపీబీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా; టీడీపీలోకా? జనసేనలోకా?
ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ముందుగా గుంటూరులో తన ముఖ్య అనుచరులతో సమావేశమైన ఆయన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
15 Feb 2023
నందమూరి తారక రామారావురూ.100వెండి నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించాలని కేంద్రం నిర్ణయం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన నాయకుడు, సినీ వినీలాకాశంలో నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు శత జయంతి సంబంర్భంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
02 Feb 2023
చిత్తూరుపాదయాత్రలో లోకేశ్ ప్రచార వాహనం సీజ్, టీడీపీ శ్రేణుల నిరసన
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ఏడోరోజుకు చేరుకుంది. పలమనేరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుండగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
27 Jan 2023
నందమూరి బాలకృష్ణలోకేశ్ పాదయాత్రలో కుప్పకూలిన నందమూరి తారకరత్న, ఆస్పత్రికి తరలింపు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' పేరుతో తన పాదయాత్రను శుక్రవారం కుప్పం మొదలుపెట్టారు. అయితే తొలిరోజు పాదయాత్రలో పాల్గొన్న సినీనటుడు నందమూరి తారకరత్న.. లోకేశ్‌తో నడుస్తున్న క్రమంలో అస్వస్థతకు గురై, ఒక్కసారిగా కుప్పకూలి పోయారు.
27 Jan 2023
చంద్రబాబు నాయుడుకుప్పంలో లోకేశ్ 'యువగళం' పాదయాత్ర ప్రారంభం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' పేరుతో తన పాద యాత్రకు శ్రీకారం చుట్టారు.
17 Jan 2023
చంద్రబాబు నాయుడురేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు
తెలంగాణలో మరో భారీ కార్యక్రమానికి టీడీపీ సిద్ధమవుతోంది. ఈనెల 18న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 27వ వర్ధంతి నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ర్యాలీలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొననున్నారు.
09 Jan 2023
భారతదేశంతెలుగునాట రాజకీయ నవోదయం: సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసి నేటికి 40ఏళ్లు
నందమూరి తారకరామారావు.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశానికే కాదు.. ప్రపంచానికి చాటిన నాయకుడు. టీడీపీని స్దాపించిన కేవలం 9నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన ఘనుడు. సరిగ్గా 40ఏళ్ల క్రితం ఇదే రోజున జనవరి 9న తెలుగునాట తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించిన ప్రజానాయకుడు ఎన్టీఆర్. ఇదే రోజున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి.. ఉమ్మడి రాష్ట రాజకీయాల్లో కొత్త శఖాన్ని పూరించారు.
09 Jan 2023
చంద్రబాబు నాయుడునిజామాబాద్పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్
తెలంగాణలో టీడీపీకి పుర్వవైభవం తెచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు మరింత ఫోకస్‌గా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో వరుస కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు.