
GVMC Mayor: విశాఖ మేయర్ పీఠం కోసం కూటమి వ్యూహం.. మ్యాజిక్ ఫిగర్ చేరువలో!
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణం గ్రేటర్ మేయర్ పదవిపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది. మ్యాజిక్ ఫిగర్ చుట్టూ రాజకీయ వేడి పెరుగుతోంది.
ఈ క్రమంలో 74వ వార్డు కార్పొరేటర్ వంశీరెడ్డి జనసేనలో చేరనున్నారనే సమాచారం ప్రాధాన్యత సంతరించుకుంటోంది.
అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాలను కలిసి ఆయన పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపినట్టు చెబుతున్నారు. ఇప్పటికే కూటమి వద్ద 70 మంది కార్పొరేటర్ల మద్దతు ఉంది.
మేయర్‌పై అవిశ్వాస తీర్మానం విజయవంతం కావాలంటే మొత్తం 74 మంది మద్దతు అవసరం. వైసీపీ వద్ద ప్రస్తుతం 3 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 33 మంది కార్పొరేటర్లు ఉన్నారు.
Details
ఆసక్తికరంగా మారిన మేయర్ పీఠం
ఈ నేపథ్యంలో కూటమికి అదనంగా నాలుగు ఓట్లు అవసరం అవుతున్నాయి.
ఈ రోజు కూటమికి చెందిన ఎమ్మెల్యేలు కీలక సమావేశానికి సిద్దమవుతున్నారు.
వైసీపీ, టీడీపీ తరఫున ఇప్పటికే విదేశాల్లో క్యాంపులు ఏర్పాటు చేసినప్పటికీ, ఇరుపార్టీల నుంచి కార్పొరేటర్లు పూర్తిగా క్యాంపులకు హాజరుకాలేదు.
మరోవైపు సీపీఐ, ఓటింగ్ విషయంలో తుది నిర్ణయాన్ని తమ రాష్ట్ర కమిటీకి వదిలేసింది.
ఇన్ని సమీకరణాల మధ్య మేయర్ పీఠంపై పోరు మరింత ఆసక్తికరంగా మారుతోంది.