Page Loader
Chandrababu Naidu: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఇద్దరు వైఎస్సార్‌సీపీ నేతలు
చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఇద్దరు వైఎస్సార్‌సీపీ నేతలు

Chandrababu Naidu: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఇద్దరు వైఎస్సార్‌సీపీ నేతలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 15, 2023
06:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ ను పుట్టిస్తున్నాయి. వైసీపీ నుండి బహిష్కృత నేతలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో శుక్రవారం తెలుగు దేశం పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్సీ, చేనేత సంఘం నేత బూదాటి రాధాకృష్ణయ్య కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం, తంబళ్లపల్లి, ఉదయగిరి, తాడికొండ, మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నాయకులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, తెనాలి శ్రావణ్‌కుమార్‌, బూరగడ్డ వేదవ్యాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టీడీపీలో చేరిన ఇద్దరు వైఎస్సార్‌సీపీ నేతలు