తదుపరి వార్తా కథనం

Kemburi Rammohan Rao: మాజీ ఎంపీ కెంబూరి కన్నుమూత
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 08, 2024
11:11 am
ఈ వార్తాకథనం ఏంటి
సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ కెంబూరి రామ్మోహన్ రావు (75) ఈరోజు తుదిశ్వాస విడిచారు.
అనారోగ్యంతో విశాఖలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కన్నుముశారు.
ఈయన తెలుగుదేశం నుంచి 1985లో చీపురుపల్లి ఎమ్మెల్యేగా, 1989లో బొబ్బిలి ఎంపీగా విజయం సాధించారు.
శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముదాలవలస మండలంలోని పుర్లి గ్రామంలో 1949 అక్టోబర్ 13న ఆయన జన్మించారు.
Details
కెంబూరి మృతిపై సంతాపం
1985 నుంచి 1989 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.పేద వర్గాల అభ్యున్నతి కోసం కెంబూరి అహర్నిశలు కృషి చేశారు.
కొంతకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఆయన మృతి పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.