Page Loader
Mahanadu: మహానాడులో కీలక చర్చలు ఇవాళే.. సాయంత్రం టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక
మహానాడులో కీలక చర్చలు ఇవాళే.. సాయంత్రం టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక

Mahanadu: మహానాడులో కీలక చర్చలు ఇవాళే.. సాయంత్రం టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక

వ్రాసిన వారు Jayachandra Akuri
May 28, 2025
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

కడప వేదికగా ఇవాళ టీడీపీ మహానాడు రెండో రోజు కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు అధికారికంగా మహానాడు ప్రారంభమయ్యే నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించనున్నారు. ఈ మహానాడు సందర్భంగా 'తెలుగుజాతి - విశ్వఖ్యాతి', 'రాష్ట్రం విధ్వంసం నుంచి పునర్నిర్మాణ దిశగా అడుగులు', 'అభివృద్ధి వికేంద్రీకరణ - వెనుకబడిన ప్రాంతాలపై దృష్టి' వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.

Details

పలు రాజకీయ తీర్మానాలకు ఆమోదాలు

''యోగాంధ్ర ప్రదేశ్'' దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లే మార్గంలో మౌలిక సదుపాయాల పరంగా రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే అంశంపై కూడా తీర్మానాలు చేయనున్నారు. అదేవిధంగా విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు, ప్రజల సంరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, పర్యాటక అభివృద్ధికి పటిష్ఠ చర్యలు వంటి అంశాలపై కూడ చర్చలు జరిపి, రాజకీయ తీర్మానాలకు ఆమోదం తెలపనున్నారు. సాయంత్రం కీలక కార్యక్రమంగా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. అనంతరం నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు.