Pawan Chandrababu: హైదరాబాద్‌లో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశం.. ఈ అంశాలపై చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
Pawan Kalyan Meets Chandrababu: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌పై రాజకీయాలపై చర్చ నడుస్తోంది.
ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బుధవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్, నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితలుపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా మార్చి లేదా ఏప్రిల్‌లో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇరు పార్టీలు అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్, చంద్రబాబు చర్చించినట్లు సమాచారం.
ఏపీ
తెలంగాణను కేస్ స్టడీగా తీసుకొని.. ఏపీలో దూకుడు
తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకొని కాంగ్రెస్ అధికారంలోకి రావడంపై పవన్, చంద్రబాబు చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం వ్యతిరేకతను కాంగ్రెస్ సమర్థంగా ఉపయోగించుకుని తెలంగాణలో కేసీఆర్‌ను ఎలా గద్దె దించిందో.. ఏపీలో ప్రభుత్వం వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకునేందుకు దీన్ని ఒక కేస్ స్టడీగా తీసుకొని ముందుకు పోవాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
తెలంగాణా ఎన్నికలు ముగిసిన మూడు రోజులకే వీరిద్దరూ భేటీ కావడం కూడా అదే విషయాన్ని తెలియజేస్తోంది.
ఇక చంద్రబాబు తన రాజకీయ కార్యకలాపాల్లో వేగం పెంచారు. రేపు దిల్లీ వెళ్లనున్న చంద్రబాబు, ఈ నెల 11 నుంచి ఏపీలో పర్యటించనున్నారు.