Page Loader
Chitturi Venkateswara Rao: ఏపీలో విషాదం.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ఏపీలో విషాదం.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Chitturi Venkateswara Rao: ఏపీలో విషాదం.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 05, 2025
01:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. టీడీపీ తణుకు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు (86) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 1983లో టీడీపీ స్థాపన అనంతరం జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో తణుకు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అయితే అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటూ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వెంకటేశ్వరరావు మృతి పట్ల తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణతో పాటు పలువురు రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.