చంద్రబాబు నాయుడును పరామర్శించిన పవన్ కళ్యాణ్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. స్కిల్ స్కాం కేసులో ఇటీవల మధ్యంతర బెయిల్ పైన చంద్రబాబు విడుదలైన విషయం తెలిసిందే. జైలు నుంచి విడుదలైన వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబు చేరారు. అనంతరం వైద్యుల సలహా మేరకు కంటి శస్త్రచికిత్స కోసం ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని వెళ్లారు. అన్ని వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత ఆయన శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ క్రమంలో ఇంటికి వచ్చిన చంద్రబాబును పవన్ కలిశారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించారు.
చంద్రబాబును కలిసిన పవన్
జూబ్లీహిల్స్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ - చంద్రబాబును పరామర్శించటానికి వచ్చిన పవన్ - పవన్ కల్యాణ్ వెంట నాదెండ్ల మనోహర్ (File Photo) pic.twitter.com/cGN8c8IbiZ— TDP Germany (@TDP_Germany) November 4, 2023