LOADING...
Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన చంద్రబాబు 
టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన చంద్రబాబు

Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన చంద్రబాబు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2025
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా మరోసారి నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈవిషయాన్ని పార్టీ మహానాడు సభ వేదికపై పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ వర్ల రామయ్య అధికారికంగా ప్రకటించారు. అనంతరం చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు,పార్టీకి చెందిన ఇతర ప్రముఖ నాయకులు ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు తొలిసారి 1995లో పార్టీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుండి గత మూడుపదుల ఏళ్లుగా అంటే సుమారు 30ఏళ్లుగా ఆయన ఈ పదవిని నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. తెలుగుదేశంపార్టీలో ప్రతి రెండేళ్లకోసారి జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి.ఈసారి కూడా ఆయనే అభ్యర్థిగా నిలిచిన చంద్రబాబు ఏకగ్రీవంగా తిరిగి ఎన్నిక కావడం గమనార్హం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు గారు ఎన్నిక