Nimmala Ramanaidu: జగన్ అక్రమ ఆస్తులపై మంత్రి రామానాయుడు తీవ్ర విమర్శలు
పశ్చిమ గోదావరిలో పాలకొల్లులో జరిగిన కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చిన జగన్‌కి రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేదని ఆయన పేర్కొన్నారు. 2004 ఎన్నికల అఫిడవిట్‌లో కేవలం లక్షల్లో సంపాదన, జూబ్లీహిల్స్‌లో చిన్న ఇల్లు చూపించిన జగన్.. ముఖ్యమంత్రిగా అయ్యాక రూ.8 లక్షల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు.
జగన్ కి ఆస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయ్..?
జూబ్లీహిల్స్‌లో బంగ్లా, లోటస్ పాండ్, బెంగళూరులో 82 గదుల ప్యాలెసులు జగన్‌కు ఎక్కడి నుంచి వచ్చాయని రామానాయుడు ప్రశ్నించారు. తాత, తండ్రి నుంచి ఇచ్చిన ఆస్తులు కాకుండా ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్రంలో శాండ్, ల్యాండ్, లిక్కర్, మైన్స్‌లను అడ్డాలుగా మార్చుకుని జగన్ దోపిడీ, లూటీకి ఒడిగట్టారని రామానాయుడు ఆరోపించారు.