తదుపరి వార్తా కథనం

Palla Srinivas: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 10, 2024
11:33 am
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఆయన తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరగా, వైద్యులు ఆయనకు వైరల్ ఫీవర్ ఉన్నట్లు నిర్దారించారు.
గత కొంతకాలంగా పల్లా శ్రీనివాస్ వరద బాధిత ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి, సహాయక చర్యల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.
పల్లా శ్రీనివాస్ త్వరలో కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు.
పల్లా శ్రీనివాసరావు జూన్ 28, 2024న తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
గాజువాక నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై 95,235 ఓట్ల తేడాతో ఆయన ఘన విజయం సాధించారు.
మీరు పూర్తి చేశారు