LOADING...
TDP-Janasena: టీడీపీ-జనసేన తొలి జాబితా విడుదల 
TDP-Janasena: టీడీపీ-జనసేన తొలి జాబితా విడుదల

TDP-Janasena: టీడీపీ-జనసేన తొలి జాబితా విడుదల 

వ్రాసిన వారు Stalin
Feb 24, 2024
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను శనివారం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ 94 సీట్లలో, జనసేన పార్టీ 24 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. అలాగే మూడు ఎంపీ సీట్లను జనసేను కేటాయించినట్లు పేర్కొన్నారు. టీడీపీ-జనసేన కలిపి మొదటి జాబితాలో మొత్తం 118 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీతో పొత్తు ఖరారైన తర్వాత వెల్లడిస్తామని చంద్రబాబు వివరించారు. చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేస్తుండగా.. నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. జనసేన విషయానికి వస్తే.. తమకు కేటాయించిన 24 సీట్లలో ప్రస్తుతం ఐదుగురు అభ్యర్థులను మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జనసేన ట్వీట్