Page Loader
Chandrababu: ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు: చంద్రబాబు 
Chandrababu: ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు: చంద్రబాబు

Chandrababu: ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు: చంద్రబాబు 

వ్రాసిన వారు Stalin
Dec 13, 2023
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

Chandrababu: టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు బుధవారం శ్రీపెరంబదూర్లోని శ్రీరామానుజార్ దేవాలయాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, పాలనలో మార్పు విషయంలో స్పష్టతతో ఉన్నారన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి సమర్థవంతమైన నాయకత్వం అవసరమని ఏపీ ప్రజలు భావిస్తున్నారన్నారు. అందరి సహకారంతోనే ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు. సమానత్వం కోసం పాటుపడిన శ్రీరామానుజుల జన్మస్థలానికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. తన కష్ట సమయంలో ప్రజలు ఇచ్చిన మద్దతును మరిచిపోలేన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శ్రీపెరంబదూర్‌లో చంద్రబాబు పూజలు