LOADING...
Chandrababu: స్కిల్ కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
స్కిల్ కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Chandrababu: స్కిల్ కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2023
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. బుధవారం చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు రాగా, సీఐడీ తరుపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మరోవైపు చంద్రబాబు హెల్త్ రికార్డులకు సంబంధించిన మెమోలను చంద్రబాబు తరుఫు న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించారు. మిగతా వాదనలను రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు వింటామని కోర్టు విచారణను వాయిదా వేసింది.

Details

గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు

చంద్రబాబు కుడి కంటికి శస్త్ర చికిత్స నిర్వహించామని, ఆయన ఐదు వారాల పాటు ఐ చెకప్ కోసం షెడ్యూల్ ఇచ్చామని కోర్టుకు తెలియజేశారు. ముఖ్యంగా చంద్రబాబు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని, గుండె పరిమాణం పెరిగిందని చెప్పారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో కూడా సమస్యలున్నాయని, ఆయన తగినంత విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించిన నివేదికను కోర్టుకు సమర్పించారు.