Page Loader
Chandrababu: రేపు దిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు, 11నుంచి జిల్లాల్లో పర్యటనలు 

Chandrababu: రేపు దిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు, 11నుంచి జిల్లాల్లో పర్యటనలు 

వ్రాసిన వారు Stalin
Dec 06, 2023
02:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత అనారోగ్యం వల్ల కొన్ని రోజలు పాటు స్తబ్దుగా ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు వరుస పర్యటనలను చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఏపీలోని జిలాల్లో పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో 7వ తేదీన దిల్లీకి వెళ్లనున్నారు. ఏపీలో ఓట్ల జాబితాలో అక్రమాలపై దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు నేరుగా ఫిర్యాదు చేయనున్నారు. ఇంకా దిల్లీలో ఆయన ఎవరిని కలుస్తారనేది తెలియాల్సి ఉంది. అలాగే ఈ నెల 11నుంచి చంద్రబాబు జిల్లాలో పర్యటించేందుకు రంగం సిద్ధమైంది. 11న శ్రీకాకుళం, 12న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడపలో చంద్రబాబు పర్యటించనున్నట్లు టీడీపీ వర్గాలు చెప్పాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేయనున్న చంద్రబాబు