NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TDP : టీడీపీ పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయం.. కడపలో మహానాడు..!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    TDP : టీడీపీ పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయం.. కడపలో మహానాడు..!
    టీడీపీ పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయం.. కడపలో మహానాడు..!

    TDP : టీడీపీ పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయం.. కడపలో మహానాడు..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 31, 2025
    08:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీడీపీ పొలిట్ బ్యూరో కీలక భేటీ జరిగింది. మూడున్నర గంటల పాటు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానమైన అంశాలపై చర్చించారు.

    మే నెలలో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమాన్ని కడపలో నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది.

    మహానాడు అనంతరం పార్టీకి సంబంధించి సంస్థాగత మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

    వివరాలు 

    పార్టీ ఎన్నికల ప్రక్రియపై చర్చ 

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నిర్వహించిన పొలిట్ బ్యూరో సమావేశంలో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై ప్రాధాన్యతతో చర్చించుకున్నారు.

    త్వరలోనే పార్టీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని సమాచారం.

    మే నెలలో జరుగనున్న మహానాడుకు ముందే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయించారు.

    నామినేటెడ్ పదవుల భర్తీ & ఎమ్మెల్యేల ప్రణాళిక

    పొలిట్ బ్యూరో సమావేశంలో నామినేటెడ్ పదవుల భర్తీపై సుదీర్ఘంగా చర్చించారు.

    అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.

    ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లే విధంగా కార్యాచరణను సిద్ధం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదుపై కూడా సమాలోచనలు జరిగాయి.

    వివరాలు 

    పొలిట్ బ్యూరోలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు: 

    పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం.

    మూడు నెలల వ్యవధిలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీల వరకు ఎన్నికలు పూర్తి చేయాలి.

    మహానాడులో చంద్రబాబును మరోసారి టీడీపీ అధ్యక్ష పదవికి ఎన్నుకునే కార్యాచరణ సిద్ధం.

    సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మహానాడు వరకు కొనసాగి, అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికైన తర్వాత ముగుస్తుంది.

    బడుగు, బలహీన వర్గాలకు కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నిర్ణయం.

    వివరాలు 

    నామినేటెడ్ పదవులపై సుదీర్ఘంగా చర్చ 

    మూడో దఫా నామినేటెడ్ పదవుల భర్తీ కోసం అర్హుల జాబితా సిద్ధం.

    ఒకటి రెండు రోజుల్లోనే మూడో దఫా నామినేటెడ్ పదవుల జాబితా విడుదలకు ప్రణాళిక.

    అసెంబ్లీ సమావేశాల అనంతరం మార్చి నుంచి ఎమ్మెల్యేలు, పార్టీ యంత్రాంగం ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ.

    ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రత్యేక ప్రణాళిక అమలు.

    వివరాలు 

    తాజా రాజకీయ పరిణామాలపై చర్చ 

    నారా లోకేశ్ పార్టీ సంస్కరణలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఒకే వ్యక్తి మూడుసార్లు కన్నా ఎక్కువ పదవి నిర్వహించకుండా ఉండేలా మార్పులు తీసుకురావాలని, కొత్తవారికి అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

    ఈ నిర్ణయాలతో పార్టీ కార్యాచరణలో మరింత స్పష్టత తీసుకువచ్చే ప్రయత్నం చేయనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    తాజా

    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా
    Opal Suchata: 'ప్రభాస్‌ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి ప్రభాస్
    Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ ఆపరేషన్‌ సిందూర్‌
    Upcoming IPOs: స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ల జోరు.. ఒకే ఒక్క కంపెనీకి సబ్‌స్క్రిప్షన్ అవకాశం స్టాక్ మార్కెట్

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    Chandrababu-Prashant kishor: ఏపీలో షాక్‌లో వైసీపీ.. చంద్రబాబు నివాసానికి ప్రశాంత్ కిషోర్  ఆంధ్రప్రదేశ్
    RGV VYUHAM : రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం' విడుదలకు బ్రేక్‌.. తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే చంద్రబాబు నాయుడు
    TDP-Janasena New Logo: టీడీపీ-జనసేన కొత్త లోగో.. 'రా కదలి రా!'పేరుతో ప్రజల్లోకి.. కింజరాపు అచ్చన్నాయుడు
    Dadi Veerabhadra Rao: వైసీపీ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025