Andhra Pradesh: డ్వాక్రా సంఘాల మహిళలకు సూపర్ స్కీమ్.. ఏపీ ప్రభుత్వం నుంచి 'స్ఫూర్తి'
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు మరో సువర్ణ అవకాశాన్ని అందించనుంది. దీపావళి పండుగకు ముందుగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రకటించిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి వంటి పథకాల అమలుకు కూడా సన్నాహాలను చేస్తోంది. అంతేకాక, కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్ఫూర్తి పథకాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. స్ఫూర్తి అంటే 2005లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇది చేతివృత్తిదారులు, రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించింది. 2022లో మరింత విస్తృతం చేసిన ఈ పథకం వివిధ పరిశ్రమలను క్లస్టర్ల వారీగా అభివృద్ధి చేసేందుకు చేయూతనిస్తుంది.
ఆంధ్రప్రదేశ్
ఈ పథకం కింద క్లస్టర్ల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్, ట్రైనింగ్, మార్కెటబులిటీ, ప్యాకేజింగ్ తదితర అంశాల్లో సహకారం అందిస్తుంది. ఈ పథకాన్ని డ్వాక్రా మహిళలకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మొదటి విడతలో 11 జిల్లాల్లో ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ప్రతి ప్రాజెక్టుకు రూ.5 కోట్ల గ్రాంట్ అందిస్తారు, ఇందులో 90శాతం కేంద్రం అందిస్తే, మిగతా 10శాతం లబ్ధిదారులు లేదా రాష్ట్రం కవరిస్తుంది. ప్రాజెక్టులో భాగంగా "కామన్ ఫెసిలిటీ సెంటర్"ను ఏర్పాటు చేసి, ప్రాసెసింగ్ యూనిట్లు, నిల్వ గోదాములు నిర్మిస్తారు. ఉత్పత్తులను సేకరించి, అమ్మకాలు జరపడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని అందరూ పంచుకుంటారు.