Page Loader
TDP Second List: టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. అభ్యర్థులు వీళ్లే 
TDP Second List: టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. అభ్యర్థులు వీళ్లే

TDP Second List: టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. అభ్యర్థులు వీళ్లే 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 14, 2024
01:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు 34 మంది అభ్యర్థులతో కూడిన రెండవ జాబితాను గురువారం విడుదల చేసింది. ఈ జాబితాలో 27 మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. అభ్యర్థుల్లో పీహెచ్‌డీ చేసిన ఒక్కరికి అవకాశం లభించింది. 11 మంది పీజీ చేసిన వారు కాగా, గ్రాడ్యుయేషన్‌ చేసిన వారు 9 మంది, ఇంటర్‌ చదివిన వారు 8 మంది, టెన్త్‌ పూర్తిచేసిన వారు ఐదుగురికి ఈ జాబితాలో చోటు కల్పించారు. రానున్న ఎన్నికలకు తెదేపా-జనసేన-బీజేపీ పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. సీట్ల సర్దుబాటులో భాగంగా తెదేపా 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. టిడిపి ఇప్పటికే 94 మందితో తొలి జాబితాను ప్రకటించింది. మరో 16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్విట్టర్ వేదికగా అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు