
APCOB: ఆప్కాబ్ ఛైర్మన్‌గా గన్ని వీరాంజనేయులు నియామకం
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు కీలక స్థానాలకు నియామకాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరికొన్ని నామినేటెడ్ పదవులను ప్రకటించింది.
తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఛైర్మన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులను నియమించింది.
ఈ పదవితో పాటు, ఏలూరు జిల్లా డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్) ఛైర్మన్ బాధ్యతలూ ఆయన చేపట్టనున్నారు.
Details
డీసీసీబీ ఛైర్మన్‌గా తుమ్మల బాబు
ప్రకాశం జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా టీడీపీ నేత కామేపల్లి సీతారామయ్య, కాకినాడ జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా జనసేన పార్టీకి చెందిన తుమ్మల బాబును నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇంకా, మార్కెటింగ్ సహకార సంస్థల నామినేటెడ్ పదవుల భర్తీ క్రమంలో.. ఏలూరు జిల్లా డీసీఎంఎస్ (డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ) ఛైర్మన్‌గా జనసేన పార్టీకి చెందిన చాగంటి చిన్నా, ప్రకాశం జిల్లాలో కసిరెడ్డి శ్యామల (టీడీపీ), కాకినాడ జిల్లాలో పి. చంద్రమౌళి (టీడీపీ)లను డీసీఎంఎస్ ఛైర్మన్‌లుగా నియమించారు.