Btech Ravi: టీడీపీ కీలక నేత బీటెక్ రవి అరెస్టు.. కారణం ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
టీడీపీ నేత, పులివెందుల నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్ రవిని మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.
కడప నుంచి పులివెందులకు వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు రవి కుటుంబ సభ్యులు తెలిపారు.
పోలీసులు రవిని అరెస్టు చేసిన తర్వాత చాలా సేపు హైడ్రామా నడిచింది. రవిని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
బీటెక్ రవిని దాదాపు 20 మందికి పైగా వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.
ఈ విషయం తెలుసుకున్న అతని భార్య స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో బీటెక్ రవి (రవీంద్రారెడ్డి)ని పోలీసులు పులివెందుల మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచారు.
టీడీపీ
అరెస్టుపై స్పందించిన నారా లోకేష్
టీడీపీ నేత నారా లోకేష్ నిర్వహించిన యాత్రలో కడప జిల్లాలో 10నెలల క్రితం పర్యటించారు.
ఈ క్రమంలో పోలీసులతో రవి దురుసుగా ప్రవర్తించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు సెక్షన్ 333 కింద కేసు నమోదు చేసిన మంగళవారం సాయంత్ర అరెస్టు చేసారు.
మరోవైపు బీటెక్ రవి అరెస్ట్‌పై నారా లోకేష్ స్పందించారు. గెలిచిన తర్వాత కూడా తన సొంత నియోజకవర్గానికి వెళ్లాలంటే జగన్ భయపడుతున్నారని లోకేష్ విమర్శించారు.
ఎన్నికల్లో బీటెక్ రవిని ఎదుర్కోవాలంటే జగన్ భయపడుతున్నారని లోకేశ్ అన్నారు.
జిల్లాలోని టీడీపీ శ్రేణులు కూడా రవి అరెస్టుపై తీవ్రంగా స్పందిస్తున్నారు. రవిని విడుదల చేయాలంటూ నిరసన చేపట్టారు.