LOADING...
Kesineni Chinni: టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు.. కలకలం రేపుతున్న వాట్సాప్ స్టేటస్
కలకలం రేపుతున్న వాట్సాప్ స్టేటస్

Kesineni Chinni: టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు.. కలకలం రేపుతున్న వాట్సాప్ స్టేటస్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2025
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు,విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిల మధ్య వివాదం తీవ్రమవుతోంది. మాటల పోరాటం ఇప్పుడు బ్యాంకు లావాదేవీల వరకు చేరింది.ఈ నేపథ్యంలో,కొలికపూడి వాట్సాప్‌ స్టేటస్‌ మీడియాలో హల్‌చల్ రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే టికెట్‌ కోసం ఇచ్చిన డబ్బుల వివరాలు బయటపెడతానంటూ కొలికపూడి తన బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ను వాట్సాప్‌ స్టేటస్‌లో పోస్ట్‌ చేశారు. చిన్నికి ఇచ్చిన డబ్బుల వివరాలతో వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టారు.ఈ విషయం గురించి శుక్రవారం స్పష్టంగా మాట్లాడతానని కూడా స్టేటస్‌లో పేర్కొన్నారు. అనుకున్నట్టే, శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో తిరువూరు పంచాయితీ సమావేశం జరగనుంది. ఈసమావేశంలో ఇరువురు నాయకులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలిచి,వివాద పరిష్కారం కోసం చర్చించనున్నారని సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు