Page Loader
Yanamala Krishnudu: ఎన్నికల వేళ టీడీపీకి షాక్.. టిడిపికి యనమల రాజీనామా
న్నికల వేళ టీడీపీకి షాక్.. టిడిపికి యనమల రాజీనామా

Yanamala Krishnudu: ఎన్నికల వేళ టీడీపీకి షాక్.. టిడిపికి యనమల రాజీనామా

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 26, 2024
06:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. సీనియర్ నేత యనమల కృష్ణుడు పార్టీకి రాజీనామా చేశారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి పార్టీ అధినాయకత్వం కృష్ణుడుకి టికెట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అయన మనస్థాపం చెందినట్టు సమాచారం. రేపు వై.ఎస్.జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. వైసిపికి పట్టున్న కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మంత్రి దాడిశెట్టి రాజాకూ, యనమల రామకృష్ణుడు కుటుంబానికీ మధ్య ఎప్పటి నుంచో ఘర్షణ ఉంది. ఈ నేపథ్యంలో గత రెండు ఎన్నికల్లో యనమల కుటుంబం నుంచి వైసిపి నేత దాడిశెట్టి రాజా మీద పోటీ చేసిన యనమల రామకృష్ణుడు సోదరుడు కఅష్ణుడు ఓటమి పాలయ్యారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టీడీపీకి యనమల కృష్ణుడు రాజీనామా